గుడ్‌న్యూస్.. పాము కాటుకు దివ్య ఔషధం.. కేవలం 5 నిమిషాల్లో.!

వర్షాకాలం వచ్చిందంటే పాములు చెలరేగిపోతాయి. వాటి ఆవాలసాలను కోల్పోవడంతో జనావాసాల్లోకి వచ్చేస్తాయి. అలాగే ఆహారం కోసం పంటపొలాల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు పాముకాటు బారిన పడి చనిపోతుంటారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

గుడ్‌న్యూస్.. పాము కాటుకు దివ్య ఔషధం.. కేవలం 5 నిమిషాల్లో.!
Snake Bite
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 03, 2025 | 11:12 AM

ప్రతి సంవత్సరం పాముకాటుకు గురై చాలామంది చనిపోతున్నారు. అయితే పాము కరిచిన వెంటనే ఏం చేయాలో తెలియక భయంతో గందరగోళానికి గురవుతారు. ఈ క్రమంలో వైద్యుల వద్దకు వెళ్లే సరికి శరీరమంతా విషపూరితం కావడంతో అప్పుడు చికిత్స చేసినా ఫలించక చాలామంది చనిపోతుంటారు. ప్రస్తుత కాలంలో వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఎంతటి అనారోగ్య సమస్యకైనా ఔషధాలు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆధునిక వైద్యంతో పాటు మన సంప్రదాయ పద్ధతులు కూడా అనేక సమస్యలకు పూర్తి పరిష్కారం చూపగలవు.

పూర్వం ఆయుర్వేద వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేసేవారు. ఈ సృష్ఠిలో ఎన్నో మొక్కలలో ఔషధగుణాలు నిండి ఉన్నాయి. అవి మనం తెలుసుకొని, వాటిని ఎలా ఉపయోగించాలో తెలసుకొంటే పాముకాట్లే కాదు, అనేక రకాల వ్యాధులను సహజ పద్ధతితో నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఎంతటి విషాన్నైనా విరిచేయగల శక్తి బోడ కాకరకాయ సొంతం. ఈ బోడ కాకరకాయనే కొన్ని చోట్ల ఆగాకరకాయ అని కూడాఅంటారు. ఈ మొక్క ఏ పాము విషాన్నైనై ఐదే ఐదు నిమిషాల్లో హరించివేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పొలాల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలు పాముకాట్లకు గురైనప్పుడు వెంటనే ఈ మొక్కను ఉపయోగించి వైద్యం చేస్తే అనేకమంది ప్రాణాలతో కాపాడవచ్చు. ఇది కేవలం పాము విషాన్నే కాదు, మరే ఇతర విషానికైనా విరుగుడుగా ఇది పనిచేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం, ఈ మొక్కను సరైన సమయంలో ఉపయోగించినట్లయితే, ఒక వ్యక్తి 5 నిమిషాల్లో పాము విషం నుండి రక్షణ పొందుతాడు. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పాము విషాన్ని ఔషధంగా మార్చేస్తుంది. దాని మూలాలు, దాని సహజ లక్షణాలను ఉపయోగించి, పాము విషాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పాము కాటు వేసిన వెంటనే ఈ మొక్కను పెడితే 5 నిమిషాల్లో శరీరం నుంచి విషం తొలగిపోతుంది. మల్లికే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ MD డాక్టర్ కుండల్ దాస్ ప్రకారం, పాము కాటు అత్యంత ప్రమాదకరమైనది. ఇది మరణానికి దారితీస్తుంది. పాముకాటుకు గురైనప్పుడు ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగించాలి. అలాగే, ఈ మొక్కలో ప్రోటీన్ ఇతర కూరగాయల కంటే ఎక్కువ. దీనితో పాటు, ఈ మొక్కలోని ఔషధ గుణాలు కూడా మానవులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పాము విషం నుండి రక్షించడానికి, బోడ కాకరకాయ మొక్క యొక్క వేర్లను 2 రోజులు ఎండలో ఎండబెట్టి, ఆపై మెత్తగా చేసి పాము కాటుకు గురైన వ్యక్తికి ఒక చెంచా పొడిని పాలలో కలిపి ఇవ్వాలి. విషం 5 నిమిషాల్లో శరీరం నుండి వెళ్లిపోతుంది, అతని ప్రాణాలను కాపాడుతుంది. పాముకాటుకు తక్షణ ఔషధంగా ఈ మొక్కను ఉపయోగించడాన్ని ఆధునిక వైద్యం కూడా నిర్ధారించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి