Trending news: హర్యాణాలో కొత్త ట్రెండ్.. హెలికాప్టర్‌లో అత్తారింటికి కొత్త జంట!
సాధారణంగా పెళ్లి తర్వాత కొత్త జంటను కారు, ప్రైవేట్ మినీ బస్సు, ట్రైన్ లేదా ఆటోలో అత్తారింటికి పంపుతాం. కానీ హరియాణాలోని నుహ్ జిల్లాలో మాత్రం కొత్త జంటలను హెలికాప్టర్‌లో అత్తారింటికి పంపుతున్నారు. అవును అండి ఇది నిజం ప్రస్తుతం అక్కడ మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. కొన్ని సామాజికి వర్గాలకు చెందిన వారు కొత్త జంటను హెలికాప్టర్‌లో అత్తారింటికి తీసుకెళ్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలో నాలుగు కొత్త జంటలు ఇలానే హెలికాప్టర్‌లో అత్తారింటికి వెళ్లారు.

నుహ్ జిల్లా తవాడు పట్టణంలోని నాట్ సామాజిక వర్గానికి చెందిన కరిష్మా అనే నవ వధువును అత్తింటికి పంపేందుకు ఓ కాలేజ్ గ్రౌండ్‌లో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే హెలికాప్టర్‌లో వెళ్లే ఈ జంటను చూసేందుకు స్థానిక ప్రజలంతా హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. ఆ ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోయింది. ఇక ఆ కొత్త జంట అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అత్తవారింటికి బయలుదేరి వెళ్లింది. అయితే అత్తవారింటి దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రాంతానికి జనాలు భారీగా తరలివచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ప్రజలంతా కేకలు వేస్తూ వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.
అయితే ఈ జిల్లాలో నవ వధువుకు హెలికాప్టర్‌లో అత్తారింటికి పంపడం గత రెండు నెలల్లో ఇది నాలుగోసారి. ఇప్పటి వరకు ఇదే జిల్లాకు చెందిన ఓ దళిత వర్గం వధువును హెలికాప్టర్‌లో అత్తారింటికి పంపగా.. ఆ తర్వాత అకేడా గ్రామానికి చెందిన మియో వర్గానికి చెందిన వధువును పంపారు, ఆతర్వాత మియో వర్గానికి చెందిన వధువును కూడా ఇలానే హెలికాప్టర్‌లో అత్తవారింటికి పంపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..