AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మొసలితో పోరాడిన కోతి.. ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, వైరల్ వీడియో

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ గేదె సింహంతో పోరాడి తన ప్రాణాలను దక్కించుకోగా, తాజాగా ఓ కోతి ప్రమాదకరమైన మొసలితో పోరాడి తన కోతి పిల్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ చివరికి కోతి పిల్ల చనిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

Viral Video: మొసలితో పోరాడిన కోతి.. ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, వైరల్ వీడియో
Viral Video
Balu Jajala
|

Updated on: Mar 20, 2024 | 12:03 PM

Share

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ గేదె సింహంతో పోరాడి తన ప్రాణాలను దక్కించుకోగా, తాజాగా ఓ కోతి ప్రమాదకరమైన మొసలితో పోరాడి తన కోతి పిల్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ చివరికి కోతి పిల్ల చనిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ భూమిపై పేరెంట్స్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా తల్లిని నిజమైన దేవతగా భావిస్తారు, ఎందుకంటే తల్లి తన బిడ్డల కోసం చేయగలిగేది ప్రపంచంలో మరెవరూ చేయలేరు.

పిల్లల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేది తల్లి మాత్రమే.. ఇది మనుషుల్లోనే కాకుండా జంతువులలో కూడా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియోలో మొసలి కోతి పిల్లను ఆహారంగా తీసుకునేందుకు దాడి చేస్తుంది. అయితే మొసలి కోతిపిల్లను నోట కరచుకొని బయట నుంచి నీటిలోకి వెళ్తుండగా తల్లి కోతి వెంటనే అలర్ట్ అయ్యింది. వెంటనే మొసలిపై దాడి చేసి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో కోతి పిల్ల చనిపోతోంది.

ఈ ఎమోషనల్ వీడియో TheBrutalNature ID పేరుతో సోషల్ మీడియా ట్విట్టర్ లో షేర్ అయ్యింది. కేవలం 36 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 54 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. ‘కోతి తన బిడ్డను రక్షించింది, కానీ పాపం చనిపోయింది’ అని ఒకరు.. CPR ఇచ్చి ఉంటే, కోతి రక్షించబడేదని మరొకరు కామెంట్స్ చేశారు. అయితే ఈ దృశ్యాలను చూసి చాలామంది ఎమోషన్ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.