Viral Video: ఈ కోతికి స్పైడర్‌మ్యాన్ పూనాడా ఏంటి..? వీడియో చూస్తే కన్ఫామ్‌గా షాకవుతారు
సోషల్ మీడియా అంటేనే అనేక వీడియోల సమాహారం. వివిధ వేదికల్లో చాలా వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా అంటేనే అనేక వీడియోల సమాహారం. వివిధ వేదికల్లో చాలా వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని కోతి వింత చేష్టలను అందరూ లైక్ చేస్తున్నారు. కొంతమంది వీడియో చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా తన మూడ్ మార్చుకుని అద్భుతమైన విన్యాసాలు చేయడం ప్రారంభించింది కోతి. స్పైడర్‌మ్యాన్ పూనినట్లు నిలువెత్తు గోడపై ఫీట్లు చేసింది. వీడియో చూసిన అనంతరం నెటిజన్లు ఈ కోతిని స్పైడర్‌మ్యాన్‌తో పోలుస్తున్నారు. స్పైడర్‌మ్యాన్ లాగా గోడ ఎక్కడానికి ప్రయత్నించిన కోతి.. చివరికి సఫలీకృతం అయ్యింది.
ముందుగా ఆ వీడియోను దిగువన చూడండి
View this post on Instagram
కోతి చాలా ఎత్తైన గోడను ఎక్కడానికి ప్రయత్నిచడం వీడియోలో చూడవచ్చు. కోతి గోడ దూకి ఎక్కడికో వెళ్లాలని ప్రయత్నిస్తోందని వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ 15 సెకన్ల వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గోడపై ఉన్న చిన్న పగుళ్ల ఆధారంగా కోతి చివరికి పెద్ద గోడను ఎక్కేసింది కోతి. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ‘ఈ కోతికి దెయ్యం పట్టినట్లు కనిపిస్తోంది’ అని ఒక యూజర్ పేర్కొన్నారు. ‘ఇలా ఎవరు గోడ ఎక్కుతారు. నేను ఇంతకు ముందు స్పైడర్‌మ్యాన్ మాత్రమే ఇలాంటి ఫీట్లు చూశాను’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ‘ఈ కోతి చాలా శిక్షణ పొందినది, తెలివైనది’ అని మరొకరు కామెంట్ పెట్టారు. వేలాది మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ప్రజలు వీడియోను తీవ్రంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Also Read: తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న ఫ్యాన్స్