AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. దొంగ తెలివికి వావ్ అనాల్సిందే.. కట్ చేస్తే..

ప్రపంచంలో ఇప్పటి వరకు అనేక రకాల దొంగతనాలు (Theft) జరిగాయి. కొన్ని ఇన్సిడెంట్స్ ఫన్నీగా అనిపిస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. దొంగలు చోరీ చేసేందుకు చిత్ర విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటారు. దొరకవద్దని ముందస్తుగానే ప్లాన్ వేసి..

Video Viral: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. దొంగ తెలివికి వావ్ అనాల్సిందే.. కట్ చేస్తే..
Mobile Thefting
Ganesh Mudavath
|

Updated on: Aug 20, 2022 | 7:33 AM

Share

ప్రపంచంలో ఇప్పటి వరకు అనేక రకాల దొంగతనాలు (Theft) జరిగాయి. కొన్ని ఇన్సిడెంట్స్ ఫన్నీగా అనిపిస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. దొంగలు చోరీ చేసేందుకు చిత్ర విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటారు. దొరకవద్దని ముందస్తుగానే ప్లాన్ వేసి వస్తువులను కొట్టేస్తుంటారు. సీసీటీవీ నుంచి తప్పించుకుని దొంగతనం చేస్తుంటే, మరికొన్ని సార్లు పట్టపగలు ఎవరూ గమనించని విధంగా దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. కానీ ఇలాంటి దొంగతాన్ని మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియో (Video) చూశాక మీరు ఆ దొంగ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో కొంత మంది వాహనదారులు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉంటారు. రైలు వచ్చే సమయం కావడంతో గార్డు గేట్ వేశాడు. దీంతో అవతలికి వెళ్లే మార్గం లేక ప్రయాణీకులు బారులు తీరారు. అదే సమయంలో ఓ వ్యక్తి అవతలి వైపు నుంచి నడిచి వస్తుంటాడు. అతను ట్రాక్ దాటి జనాల్లోకి కలిసిపోతాడు. అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి నుంచి ఫోన్ కొట్టేసి పరారవుతాడు. బాధితుడు తేరుకుని దొంగ కోసం పరిగెత్తగానే రైలు ట్రాక్ పై దూసుకొస్తుంది. దీంతో అతను ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు.

ఈ ఫన్నీ దొంగతనం వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 44 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 1.2 మిలియన్లు అంటే 12 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా 21 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ దొంగ ఆలోచనను ‘మాస్టర్ ప్లాన్’గా అభివర్ణించగా, కొందరు ఈ వీడియోను స్క్రిప్ట్‌గా వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి