బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు? 99శాతం మందికి ఇది తెలీదు
మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో ఒంటెలకు 'హయామ్' వ్యాధి వచ్చినప్పుడు సజీవ పాములను తినిపించే సంప్రదాయం ఉంది. ఇది ఒంటె కోలుకుంటుందని స్థానికుల నమ్మకం. అయితే, పశువైద్య నిపుణులు దీనిని ఖండిస్తున్నారు. పాము విషం వ్యాధిని నయం చేస్తుందని శాస్త్రీయ ఆధారాలు లేవని, సరైన వైద్య చికిత్స అవసరమని స్పష్టం చేస్తున్నారు.

మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో ఒంటెలకు బతికి ఉన్న విషపూరిత పాములను తినిపించే ఓ విచిత్రమైన సాంప్రదాయం ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒంటె నోటిలో సజీవ పామును ఉంచి, ఆ తర్వాత దానికి నీరు తాగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు షూట్ చేశారనే విషయంపై స్పష్టత లేకపోయినా, ఈ సంప్రదాయంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. స్థానికుల నమ్మకం ప్రకారం.. ఒంటెలకు సోకే హయామ్ అనే వ్యాధికి ఈ విధానాన్ని అనుసరిస్తారు. హయామ్ వ్యాధి సోకిన ఒంటెలు క్రమంగా ఆహారం, నీరు తీసుకోవడం మానేస్తాయి. శరీరం బలహీనపడటం, జ్వరం, నీరసం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని స్థానికులు విశ్వసిస్తారు.
ఈ నమ్మకంతో కొన్ని ప్రాంతాల్లో సజీవ పామును, కొన్నిసార్లు అత్యంత విషపూరితమైన రాజనాగు వంటి పామును కూడా ఒంటె నోటిలో వేస్తారు. అనంతరం పాము కడుపులోకి వెళ్లేలా నీరు తాగిస్తారు. పాము విషం ఒంటె శరీరంలోని ఇన్ఫెక్షన్ లేదా అనారోగ్యాన్ని తగ్గిస్తుందని, కొద్ది రోజుల్లోనే జంతువు కోలుకుంటుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ పద్ధతిని పశువైద్య నిపుణులు పూర్తిగా ఖండిస్తున్నారు. సజీవ పాములను తినిపించడం వల్ల హయామ్ వ్యాధి నయమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవని స్పష్టం చేస్తున్నారు.
ఈ వ్యాధి బ్యాక్టీరియా, పరాన్నజీవులు లేదా కీటకాల కాట్ల కారణంగా వచ్చే అవకాశం ఉందని, సరైన వైద్య చికిత్సతోనే దాన్ని నియంత్రించవచ్చని వివరిస్తున్నారు. ప్రత్యేకించి గర్భిణీ ఒంటెలకు ఈ వ్యాధి మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గర్భస్రావం లేదా ఒంటె మరణానికి కూడా దారితీయవచ్చని పేర్కొంటున్నారు. అందువల్ల సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడకుండా, ఆధునిక పశువైద్యుల సూచనల మేరకు చికిత్స అందించడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
