AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఎంటర్‌టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. అందరి దృష్టి ఆ సినిమాపైనే

గత వారం థియేటర్లలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కేవలం రీ రిలీజులు మాత్రమే జరిగాయి. అయితే ఈ వారం మాత్రం ఆసక్తికర సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: ఎంటర్‌టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. అందరి దృష్టి ఆ సినిమాపైనే
OTT Movies
Basha Shek
|

Updated on: Jun 29, 2026 | 6:05 PM

Share

మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ లో నాగ బంధం, రావు బహదూర్ వంటి ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ చూస్తుంటే రెండు చాలా డిఫరెంట్ మూవీస్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఆర్ ఆర్ఆర్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్ర లో నటించిన అల్ట్రా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కూడా ఈ వారంలోనూ థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ దృష్టి మొత్తం ‘అబ్సెషన్’ మూవీ పైనే ఉంది. వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పెద్ది’ కూడా ఈ వారంలోనే డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’, ఐశ్వర్య రాజేశ్ ‘ఇసకపట్నం’ లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. మొత్తానికి ఈ వారం థియేటర్లు- ఓటీటీ సినిమాలతో ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందనుందని చెప్పవచ్చు.

ఆహా ఓటీటీలో

  • టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) – జూలై 03

నెట్‌ఫ్లిక్స్

  • సూపర్ సుబ్బ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 02
  • పెద్ది (తెలుగు సినిమా) – జూలై 02 (రూమర్ డేట్)
  • ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 02
  • హ్యుమన్ వెపర్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 02
  • స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్‌ వెబ్ సిరీస్) – జూలై 05

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • అబ్సెషన్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 30 (రెంటల్ బేసిస్)
  • ఎల్లే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 01
  • ఇసకపట్నం (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 02

జీ5 ఓటీటీలో

  • మర్మదేశం (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 03
  • ముతస్సీ (మలయాళ వెబ్ సిరీస్) – జూలై 03

జియో హాట్‌స్టార్

  • మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 03
  • ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – జూలై 03

సన్ నెక్స్ట్

  • హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) – జూలై 03
  • ఆపిల్ టీవీ ప్లస్
  • సిలో సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 03

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us