Restaurant Bill: 1971లో మసాలా దోశ, కాఫీ ధర ఎంతో తెలుసా.?
సోషల్ మీడియాలో 1971వ సంవత్సరం నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి వైరల్ అవుతోంది. అందులో రెండు కాఫీ, రెండు మసాలా దోశలకు కేవలం రెండు రూపాయలు మాత్రమే చెల్లించాడు ఓ కస్టమర్. ఇక ఈ బిల్లు వైరల్ కావడంతో నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

చరిత్ర ఆనవాళ్లు, బ్రిటీష్ మూలాలు.. ఇప్పటికీ మన పూర్వీకులు ఎలా సర్వైవ్ అయ్యారనేది చెప్పడానికి నిదర్శనంగా ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతం వాడుతున్న దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల జరిగే ప్రతీ విషయం.. క్షణాల్లో మన చేతుల్లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాత బిల్లులు, టిఫిన్ రేట్లు, లైబ్రరీ బిల్స్ లాంటి అరుదైన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో 1971 నాటి ఓ రెస్టారెంట్ బిల్లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అప్పట్లో రెస్టారెంట్ బిల్లు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సాధారణంగా ఓ కప్పు కాఫీ లేదా టీ.. రూ. 10 నుంచి రూ. 20 ఉంటుంది. ఇక ఈ ధర ప్రతీ రాష్ట్రంలోనూ వేర్వేరుగా ఉంటుంది. అక్కడి పాల ధరలకు తగ్గట్టుగా రేట్లను ఫిక్స్ చేస్తుంటారు. అయితే 1971 నాటి ఓ హోటల్ బిల్లు ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 50 ఏళ్ల క్రితం నాటి కాఫీ బిల్లు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. గతంలో ఢిల్లీలో మోతీ మహల్ రెస్టారెంట్ అని ఒకటి ఉండేది. ఆ రెస్టారెంట్ బిల్లు ఒకటి.. ఇప్పుడు ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. 28.06.1971న మోతీ మహల్ రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి 2 మసాలా దోసెలు, 2 కాఫీలకు కేవలం రెండు రూపాయల బిల్లు చెల్లించాడు.
కాగా, 50 ఏళ్ల క్రితం అంటే రెండు రూపాయలతో సరిపోయింది. ఇప్పుడు అదే ఆర్డర్ ఓ రెస్టారెంట్‌లో చేస్తే రూ. 500 నుంచి రూ. 700 వరకు అవుతుంది. 1970లో కేవలం రూ. 1కే కడుపునిండా భోజనం దొరుకుతుంది. ఇప్పుడు అలా కాదు. ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాత బిల్లుపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
