AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అంత పెద్ద కొండచిలువ చిన్న పిల్లిని మింగలేకపోయింది.. ఏంటా అని ఎక్స్ రే తీయగా.. పొట్టలో

అది పెద్ద కొండచిలువ. పెద్ద జీవులు కూడా దానికి జుజుబీ. ఒక్క ఉదుటన అమాంతం మింగేయగలదు. కానీ చిన్న పిల్లిని తినేందుకు ఆపసోపాలు పడుతుంది. దాన్ని గమనించిన స్థానికులు.. పాములు రెస్క్యూ చేసే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత....

Viral: అంత పెద్ద కొండచిలువ చిన్న పిల్లిని మింగలేకపోయింది.. ఏంటా అని ఎక్స్ రే తీయగా.. పొట్టలో
Python
Ram Naramaneni
|

Updated on: Apr 25, 2024 | 7:55 AM

Share

చూడండి ఎంత పెద్ద కొండ చిలువో. సాధారణంగా ఇలాంటి పైథాన్స్ ఎంత పెద్ద జీవుల్ని అయినా అమాంతం మింగేస్తాయి. వాటిని అరిగించుకోగల వ్యవస్థ కూడా కొండచిలువకు ఉంటుంది. అయితే మంగళూరు సమీపంలోని అనేగుండి నగరంలో ఓ పర్షియన్ పిల్లిని కొండచిలువ వేటాడింది. అయితే దాన్ని మింగేందుకు మాత్రం ఆపసోపాలు పడుతుంది.  స్థానికులు కాస్త దగ్గరికి వెళ్లి చూడగా.. ఏదో వల దాని నోటికి చుట్టుకుని కనిపించింది. దీంతో వారు.. పాములకు రెస్క్యూ చేసే వ్యక్తి భువన్ దేవడిగకు సమాచారం ఇచ్చారు. నిశితంగా పరిశీలించగా, కొండచిలువ పిల్లిని మింగేసే ప్రయత్నంలో అనుకోకుండా వలలో చిక్కుకున్నట్లు దేవాడిగ గుర్తించారు. దేవాడిగ వెంటనే అటవీ శాఖాధికారులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులు వచ్చి..  వల నుంచి బయటకు తీసి దానికి విముక్తి కల్పించారు. కొండచిలువ యాక్టివ్ గా లేకపోవడంతో చికిత్స నిమిత్తం పశువైద్యాధికారి డాక్టర్ యశస్వి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం..  పూర్తిస్థాయిలో ఎక్స్ రే తీయగా దిగ్భ్రాంతికర రీతిలో దాని పొట్టలో.. 11 ఎయిర్ బుల్లెట్స్ కనిపించాయి. వాటిలో రెండింటిని వన్యప్రాణి పశువైద్యాధికారి డాక్టర్ యశస్వి తొలగించారు.

“కొండచిలువపై ఎయిర్‌గన్‌తో చాలా సంవత్సరాల క్రితం కాల్పులు జరిపి ఉండొచ్చు. కాలక్రమేణా, బుల్లెట్ గాయాలు అయిన చోట చర్మం పెరిగింది. మేము రెండు బుల్లెట్లను తొలగించాము. కొండచిలువ కోలుకుంటోంది ”అని భువన్ దేవాడిగ తెలిపారు. (Source)

పైథాన్స్ తమ ఆహారాన్ని పూర్తిగా మింగేస్తాయి. పెద్ద జీవులను మింగటానికి వీలుగా సాగేలా వాటి దవడల నిర్మాణం ఉంటుంది. వాటికి ఆహారం ఎంత పెద్దగా ఉంటే అంత ఇష్టమట. కొండచిలువలు కొన్నిసార్లు.. తమ ఆహారం పరిమాణం ఎంత అనేది సరిగా అంచనా వేయకుండా.. వేటాడి ఇబ్బంది పడుతూ ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే