Viral Video: అమ్మాయిని పడేయాలనుకున్నాడు.. పోజులు కొట్టాడు.. కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్!
సోషల్ మీడియా అంటేనే ఎంటర్టైన్మెంట్‌కు నిలయం. ప్రతీ రోజూ లక్షల్లో వైరల్ వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు...
సోషల్ మీడియా అంటేనే ఎంటర్టైన్మెంట్‌కు నిలయం. ప్రతీ రోజూ లక్షల్లో వైరల్ వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని హృదయాన్ని కదిలిస్తాయి. ఇక తాజాగా ఓ వీడియో నెటిజన్లకు తెగ నవ్విస్తోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. ఇందులో ఓ కుర్రాడు.. ఓ అమ్మాయిని పడేయడానికి పడిన పాట్లు తెగ నవ్వు తెప్పిస్తాయి. వీడియో లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ అయితే.. అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాయి.
వైరల్ వీడియో ప్రకారం.. బుర్ఖా ధరించిన ఓ అమ్మాయి రోడ్డు పక్కన ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె పక్కనే ఓ బైక్ పార్క్ చేసి ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న ఓ కుర్రాడు ఆమెను చూసి సడన్‌గా అక్కడ ఆగుతాడు. అనంతరం ఆ అమ్మాయిని ఎలాగైనా పడేయాలని డిసైడైన అతడు.. లైన్ వేయడం మొదలు పెడతాడు. కళ్లజోడు పెట్టుకుని ఒకసారి.. బైక్‌పై ఇరువైపులా కూర్చుని మరోసారి.. అలాగే బైక్‌పై వాలిపోయి.. ఇలా రకరకాల స్టిల్స్ ఇచ్చాడు. అటు.. ఇటూ తిరుగుతూ అతడు చేసే చేష్టలను ఆమె గమనిస్తూనే ఉంది. ఆమె అతడినే చూస్తుండటంతో.. ఆ కుర్రాడిలో జోష్ మరింత పెరిగింది. తన స్టైల్‌లో సైట్ కొట్టడం కంటిన్యూ చేశాడు.
అయితే ఇప్పుడే కథలో అసలు ట్విస్ట్ వచ్చింది. సీన్‌లో ఎర్రటి షర్ట్ ధరించిన వ్యక్తి ఒకడు వచ్చి.. ఆ కుర్రాడిని బైక్‌పై నుంచి పక్కకి జరగమని చెప్పాడు. అంతేకాదు.. ఆమెను బైక్ ఎక్కించుకుని వెళ్లిపోయాడు. చూశారా.! ఈ ట్విస్ట్ మీరు కూడా ఊహించలేదు కదా.. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోను చూసేయండి. కాగా, ఈ వీడియో ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
View this post on Instagram