AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడవిలో ఉబ్బిన పొట్టతో కదలకుండా కనిపించిన కొండచిలువ.. పట్టుకొచ్చి దాన్ని కోసి చూడగా..

ఇండోనేషియాలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక భారీ కొండచిలువ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తిని సజీవంగా మింగేసింది. గాలింపు చర్యల తర్వాత ఆ కొండచిలువ కడుపులో అతని మృతదేహాన్ని గుర్తించిన దృశ్యాలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆ వివరాలు..

Viral Video: అడవిలో ఉబ్బిన పొట్టతో కదలకుండా కనిపించిన కొండచిలువ.. పట్టుకొచ్చి దాన్ని కోసి చూడగా..
Python
Ravi Kiran
|

Updated on: May 09, 2026 | 1:16 PM

Share

ప్రకృతిలో అడవి జంతువులు ఎంత క్రూరంగా ఉంటాయో చెప్పడానికి ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం. ఇది జరిగి ఏడాదిపైనే గడుస్తున్నా.. సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ఒక యువకుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో మొదలైన గాలింపు, చివరకు ఊహించని భీభత్సానికి దారితీసింది. అప్పటి స్థానిక సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి తన పొలం పనుల నిమిత్తం లేదా అడవిలోకి వెళ్ళినప్పుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతని కోసం వెతుకుతుండగా, అడవిలో వింతగా ఉబ్బి ఉన్న ఒక భారీ కొండచిలువ కనిపించింది. ఆ పాము కడుపు భాగం చాలా పెద్దదిగా ఉండటం, అది కదలలేకపోవడంతో గ్రామస్తులకు అనుమానం కలిగింది.

ఇది చదవండి: పొలానికి వెళ్లిన రైతుకు దూరంగా ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా.. ఆశ్చర్యంగా.!

ఇవి కూడా చదవండి

వెంటనే గ్రామస్తులు ఆ కొండచిలువను పట్టుకుని, దాని కడుపును కోసి చూడగా అందరూ నిర్ఘాంతపోయారు. కనిపించకుండా పోయిన వ్యక్తి మృతదేహం ఆ పాము కడుపులో నుంచి బయటపడింది. ఆ వ్యక్తిని ఆ పాము సజీవంగానే మింగేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి తండ్రి తన కొడుకు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. “నా కొడుకు ఇలాంటి ఘోర మరణం పొందుతాడని అనుకోలేదు” అంటూ ఆయన చేసిన రోదన అక్కడి వారిని కలిచివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులు నివసించే ప్రాంతాల్లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

ఇది చదవండి: మీ ఇంటిలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే..? ఇది ఒక్కటి వేస్తే వద్దన్నా పూస్తాయ్..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us