AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు.. ఈ పక్షి దగ్గరకు వెళ్తే గాలిలోనే ప్రాణాలు కలిసిపోతాయ్..

చూడటానికి తెల్లగా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే నార్తర్న్ ఫుల్మార్ పక్షిని చూసి మోసపోకండి! దీని దరిదాపుల్లోకి వెళ్తే డేగలు, గద్దలు కూడా గాలిలోనే ప్రాణాలు వదులుతాయి. తనపై దాడికి వచ్చే శత్రువులపై ఇది ప్రయోగించే రసాయన ఆయుధం ఏంటి? ఈ కథనంలో తెలుసుకోండి.

చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు.. ఈ పక్షి దగ్గరకు వెళ్తే గాలిలోనే ప్రాణాలు కలిసిపోతాయ్..
Bird
Ravi Kiran
|

Updated on: May 05, 2026 | 8:37 PM

Share

ఆకాశంలో ఎగిరే పక్షుల్లో డేగలు, గద్దలే అత్యంత శక్తివంతమైనవని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో రూపురేఖలను బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని నిరూపిస్తుంది ‘నార్తర్న్ ఫుల్మార్’. సముద్ర తీరాల్లో, ఆకాశంలో తెల్లగా, ఎంతో అమాయకంగా కనిపించే ఈ పక్షిని చూసి ఏదో సాఫ్ట్ పక్షి అనుకుంటే పొరపాటే. దీనికి ఎదురుపడితే సాక్షాత్తు గద్దలు కూడా తమ రూట్ మార్చుకోవాల్సిందే!

అసలు ఈ పక్షిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. దీని వద్ద ఒక భయంకరమైన రసాయన ఆయుధం ఉంది. సాధారణంగా ఏదైనా పెద్ద పక్షి దీనిపై దాడికి వస్తే, నార్తర్న్ ఫుల్మార్ భయపడి పారిపోదు. పైగా ధైర్యంగా ఎదురు నిలబడి తన నోటి నుంచి ఒక వింత ద్రవాన్ని శత్రువు ముఖంపై స్ప్రే చేస్తుంది. అది మామూలు నీరు అనుకుంటే శత్రువు పప్పులో కాలేసినట్టే. అది నారింజ రంగులో ఉండే ఒక జిగట ఆయిల్. ఈ ఆయిల్‌లో ఉండే రసాయనాలు ఎంత ప్రమాదకరమంటే, అది శత్రు పక్షి రెక్కలకు అంటుకోగానే సిమెంట్‌లా గట్టిపడిపోతుంది. పక్షులకు ఎగరడానికి రెక్కలు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. వన్స్ ఈ జిగురు అంటుకుంటే, గాలిలో రెక్కలు ఆడించడం అసాధ్యంగా మారుతుంది.

ఫలితంగా ఆ పక్షి నియంత్రణ కోల్పోయి కింద ఉన్న నీటిలో పడిపోతుంది. రెక్కలు పని చేయకపోవడంతో నీటిపై తేలలేక, మెల్లగా మునిగి ప్రాణాలు వదులుతుంది. అంటే, నార్తర్న్ ఫుల్మార్ తన శత్రువును నేరుగా చంపకుండా, గాలిలోనే దాని రెక్కలను కట్టేసి మృత్యువుకు అప్పగిస్తుంది. బయటికి శాంతంగా కనిపించినా, తన జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఈ పక్షి నిజంగానే ఆకాశంలోని ‘సైలెంట్ కిల్లర్’. ప్రకృతిలో ప్రతి జీవికి తనను తాను కాపాడుకోవడానికి ఎంతటి అద్భుతమైన శక్తులు ఉంటాయో చెప్పడానికి ఈ పక్షి ఒక గొప్ప ఉదాహరణ.

Follow Us
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ
శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ
శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..
శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..
అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!
అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!
మన దేశంలో అత్యధిక బంగారం ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
మన దేశంలో అత్యధిక బంగారం ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Apara Ekadashi: అపర ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ధనవర్షం!
Apara Ekadashi: అపర ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ధనవర్షం!