
ఈ భూమిపై ఉన్న అనేక రకాల జీవుల్లో.. పాములు చాలా ప్రాణాంతకం అని చెప్పొచ్చు. వాటితో ఆట ఆడితే మన ప్రాణాలకే ముప్పు. పాములను చూసిన వెంటనే జనాలు తుర్రున పారిపోవడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు మీకు చూపించే వీడియోలోని వ్యక్తి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు బొమ్మల మాదిరిగా పాములతో ఆడుకోవడం మనం చూడవచ్చు. భయానకంగా కనిపించే ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కుప్పలు తెప్పలుగా పాములను.. అది కూడా విషపూరితమైన వాటిని రెండు చేతుల్లోకి తీసుకుని.. తాళ్లలా వేలాడదీశాడు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అవి అతడిపై ఎలాంటి దాడి చేయలేదు. ఎలాంటి బెరుకు లేకుండా.. ఆ పాములను ఓ ఊపు ఊపేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో therealtarzann అనే నెటిజన్ షేర్ చేయగా.. ఇప్పటివరకు 1 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అవి బొమ్మలు కావు భయ్యా.! పాములు అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది నేను ఎప్పుడూ చూడలేదని ఇంకొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి