Video Viral: మట్టిలోకి వెళ్లిన పామును పట్టుకున్న వ్యక్తి.. ఈ వీడియో చూస్తే నిజంగా గూస్ బంప్సే!!
పాము కనిపిస్తే అమ్మో అని ఆమడ దూరం పెరిగెడతాం. దానికి ఎలాంటి హానీ చేయమని అర్థమైతే.. పాములు తమ దారి అవి చూసుకుంటాయి. లేదంటే మనకు హాని చేస్తాయి. పాముల్లో కొన్ని కాటు వేసేవి ఉంటాయి. మరికొన్ని పాములు హానికరమైనవి కావు. అయితే ఇంకొన్ని పాములు చాలా విషపూరితమైనవి. ఎవరినైనా కాటు వేస్తు.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదే ఆ పామునే పట్టుకోవాలంటే మామూలు విషయమా. నిజమే మరి పామును పట్టుకోవడం అందరితో అయ్యే పని కాదు. దాన్ని ఎంతో చాకచక్యం వ్యవహరించి, ఓర్పుతో..

పాము కనిపిస్తే అమ్మో అని ఆమడ దూరం పెరిగెడతాం. దానికి ఎలాంటి హానీ చేయమని అర్థమైతే.. పాములు తమ దారి అవి చూసుకుంటాయి. లేదంటే మనకు హాని చేస్తాయి. పాముల్లో కొన్ని కాటు వేసేవి ఉంటాయి. మరికొన్ని పాములు హానికరమైనవి కావు. అయితే ఇంకొన్ని పాములు చాలా విషపూరితమైనవి. ఎవరినైనా కాటు వేస్తు.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అదే ఆ పామునే పట్టుకోవాలంటే మామూలు విషయమా. నిజమే మరి పామును పట్టుకోవడం అందరితో అయ్యే పని కాదు. దాన్ని ఎంతో చాకచక్యం వ్యవహరించి, ఓర్పుతో పట్టుకోవాలి. అయితే కొందరు ఎంతో సాహసించి అలాంటి పాములను పట్టుకునే పనే చేస్తూంటారు. దానికి ఎంతో నైపుణ్యం కావాలి. పాములు పట్టే వారి మాటను కూడా వింటాయి పాములు.




తాజాగా ఓ పామును పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పామును పట్టుకున్న విధానం చూస్తే నిజంగానే మనకు గూస్ బమ్స్ వస్తాయి. ఇళ్లు తవ్వుడుండగా వారికి పాము ఒకటి కనిపించింది. వెంటనే వారు పాములను పట్టే వారికి సమాచారం అందించారు. ఈలోపు పాము మట్టిలోపలికి వెళ్లింది.
వెంటనే వచ్చిన వారు ఓ వ్యక్తి పార సహాయంతో గోడ అంచు నుండి ఇటుకలు, మట్టిని తొలగిస్తుండగా.. మరో వ్యక్తి పామును పట్టే కర్రతో పాము ఎక్కడ ఉందా? అని వెతుకుతున్నాడు. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి మట్టిని తీయడం మానేసి, ఆ తర్వాత పామును పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి తన పని మొదలుపెడతాడు. అతను గోడ లోపల నుండి మట్టి, ఇటుకలను కొద్దికొద్దిగా తొలగిస్తాడు.
దీంతో అతనికి పాము తోక కనిపిస్తుంది. వెంటనే దాన్ని పట్టుకుని.. నెమ్మదిగా దాన్ని కర్ర సహాయంతో పైకి లాగుతాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న డబ్బాలో ఆ పాము వెళ్లేలా చేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram
