Watch Video: భర్త కోసం అన్నం త్యాగం చేసిన భార్య.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ?
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో మరచిపోలేని మధురమైన ఘట్టం. పెళ్లి తర్వాత భార్యభర్తలుగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా కలిసి ఉండాలని అనుకుంటారు. అయితే పెళ్లి తర్వాత కేవలం సంతోషాలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా అవుతుంటాయి. కొందరికైతే ఆ గొడవలు ఎక్కువై విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి.

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో మరచిపోలేని మధురమైన ఘట్టం. పెళ్లి తర్వాత భార్యభర్తలుగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా కలిసి ఉండాలని అనుకుంటారు. అయితే పెళ్లి తర్వాత కేవలం సంతోషాలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా అవుతుంటాయి. కొందరికైతే ఆ గొడవలు ఎక్కువై విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దీంతో వారి దాంపత్య బంధం తెగిపోతుంది. అయితే మరికొందరు భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకంటూ ఎన్ని గొడవలు, మనస్పర్థలు వచ్చిన సర్దుకుపోతూ ఆనందంగా కాలం వెల్లదీస్తుంటారు. తాజాగా ఇలాంటి తరహాలోనే ఓ భార్య తన భర్త మీద చూపించిన ప్రేమను చూసి చాలమంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ భార్య భర్తలు డైనింగ్ టైబుల్‌పైన కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే భర్త మాత్రం మొబైల్‌ను చూస్తూనే తింటుంటాడు. అలా తింటుండగానే అతని ప్లేట్లో అన్నం అయిపోతుంది. దీంతో అతడు అన్నం వడ్డిచంమని మొబైల్ ఫోన్‌ని చూస్తూనే తన భార్యను అడుగుతాడు. ఆమె అన్నం వడ్డించేదుకు ఆ బౌల్‌ను తీసుకుంటుంది. కానీ అందులో చూస్తే అన్నం అప్పిటికే అయిపోతుంది. దీంతో తన భర్త ఆకలి తీర్చేందుకు ఆమె తన ప్లేటులో ఉన్నటువంటి ఆహారాన్ని ఆ గిన్నెలో వేస్తుంది. ఆ తర్వాత ఆ అన్నాన్ని తన భర్తకు వడ్డిస్తుంది. మరో విషయం ఏంటంటే అసలు ఈ విషయాన్ని కూడా తన భర్తకు తెలియకుండా ఉండేందుకు గిన్నెలో ఉన్న ఆహారాన్నే వడ్డిస్తున్నట్లుగా నటిస్తుంది. అయితే ఆమె భర్త మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ అన్నం తింటూ ఉంటాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. భర్త కోసం ఆమె చేసిన త్యాగాన్ని కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం అంత మంచి భార్యను భర్త ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.
