AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు.. ఇంటికొచ్చిన పార్శిల్‌ తెరిచి చూడగా ఊహించని షాక్.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. జనాలందరూ కూడా తమకు కావాల్సిన వస్తువులను ఇంటి దగ్గర నుంచి ఆన్‌లైన్ ద్వారా..

Viral News: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు.. ఇంటికొచ్చిన పార్శిల్‌ తెరిచి చూడగా ఊహించని షాక్.!
Flipkart
Ravi Kiran
|

Updated on: Oct 06, 2021 | 11:02 AM

Share

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. జనాలందరూ కూడా తమకు కావాల్సిన వస్తువులను ఇంటి దగ్గర నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం అసలే పండగ సీజన్ మొదలైంది. కమర్షియల్ ఆన్‌లైన్ సైట్‌లు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్స్, డిస్కౌంట్‌లు ప్రకటిస్తున్నాయి. అయితే ఆ ఆఫర్స్‌లకు ఆకర్షితులైతే మొదటికే మోసం వస్తుంది.

ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే.. ఇంటికి డెలివరీగా వేరొక వస్తువు రావడం వంటి సంఘటనలు మనం తరచూ వింటూనే ఉంటాం. దీనికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఇలా మోసపోయిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఆ కోవకు చెందిన తాజాగా ఒకటి జరిగింది. ఫ్లిఫ్‌కార్ట్ బిలియన్ డేస్ నడుస్తోన్న నేపధ్యంలో ఓ వ్యక్తి పవర్ బ్యాంక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా.. ఇంటికొచ్చిన పార్శిల్‌ను తెరిచి చూసి ఖంగుతిన్నాడు. ఇంతకీ ఆ కథేంటో చూద్దాం..

వాస్తవానికి రాహుల్ అనే యూజర్ ఆన్‌లైన్‌లో 2000mah పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన పార్శిల్ ఇంటికి వచ్చింది. ఇక ఎంతో ఆతృతగా దానిని ఓపెన్ చేశాడు. అక్కడ పవర్ బ్యాంక్‌కు బదులుగా ఓ ఇటుకను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దీనితో వెంటనే ‘ఫ్లిప్‌కార్ట్’కు ఫిర్యాదు చేశాడు. తన ఆర్డర్ ఐడీని పేర్కొని.. ”20000mah పవర్ బ్యాంక్‌కు బదులుగా ఇటుకను పంపినందుకు ధన్యవాదాలు” అంటూ ఫ్లిప్‌కార్ట్‌కు ట్వీట్ చేశాడు. ఇక ఇదే పరిస్థితి తాము కూడా ఎడుర్కున్నట్లు ఇతర వినియోగదారులు కూడా తమ సమస్యలను వెళ్లబుచ్చుకున్నారు.

Also Read:

మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

ట్వీట్ ఇదే..

లైటర్లకు బదులుగా నట్-బోల్ట్‌లు..

ట్రుకే బడ్స్ బదులుగా ఖాళీ డబ్బా…

ఇయర్ బడ్స్ బదులుగా సబ్బు…