Heart Touching Video: బాగా ఆకలేసినట్లుంది.. నేను తింటున్న ప్లేట్‌లో నాతో కలిసి భోజనం చేసింది..

|

Jun 16, 2021 | 4:58 PM

Heart Touching Video: ఒకరి అవసరానికి మరొకరు తోడైతే - అది ఎంతో ఆసరా! మనిషి మనిషిలా స్పందించటమే మానవత్వం అంటే! విపత్తుల వేళ, కష్టాల వేళ కమ్ముకొచ్చే హృదయ స్పందనే మానవీయత అంటే! అన్నింటిలో ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది..

Heart Touching Video: బాగా ఆకలేసినట్లుంది.. నేను తింటున్న ప్లేట్‌లో నాతో కలిసి భోజనం చేసింది..
Man And Bird Eat Food
Follow us on

జంతువుల ఫన్నీ వీడియోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులోని కొన్ిన వీడియోలు  ఆశ్చర్యకరమైనవి… మరికొన్ని చాలా అందమైనవి, ఇక కొన్ని వీడియోలు మాత్రం మళ్లీ.. మళ్లీ.. చూడాలనిపించేలా ఉంటాయి. అదే సమయంలో కొన్ని వీడియోలు కూడా జ్ఞానాన్ని పంచేవి కూడా ఉంటాయి. అయితే అలాంటి ఓ వీడియో ఒకటి సామాజిక మాద్యామాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజల హృదయాలను ప్రత్యక్షంగా తాకుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆహారం తింటున్నాడు.. అప్పుడే ఒక పక్షి వచ్చి అతను తింటున్న టెబుల్ పైకి వచ్చి కలిసి ఆహారం తినడం మొదలు పెట్టింది. అతను కూడా దానికి కొంత తన ప్లేట్‌లోని భోజనంను పెట్టాడు. ఇలా ఇద్దరూ కలిసి తినడం ఆ పక్కనే కూర్చున్నవారికి ఆశ్చర్యాన్ని, ఉద్వేగాన్ని కలిగించింది.

సాధారణంగా ఎవరైనా ఆహారం తిన్నప్పుడు జంతువులను… పక్షులను దగ్గరకు రాకూడదనే ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు పై నుంచి కూడా వెళ్లడానికి ఇష్టపడరు.  కానీ, ఈ వీడియోలో ఏదో ఒక క్షణం ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఒక వ్యక్తి ఎలా హాయిగా తింటున్నాడో మీరు వీడియోలో చూడవచ్చు.  కాబట్టి మొదట మీరు ఈ వీడియో చూడండి…

 హార్ట్ టచ్చింగ్ వీడియో’

ఈ వీడియో ఖచ్చితంగా మీ హృదయాన్ని టచ్ చేసి ఉంటుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ స్టోరీని  రాసే సమయం వరకు, ఈ వీడియోను 2 లక్షల 64 వేలకు పైగా లైక్ చేశారు.  అంతే కాదు చాలా  ఫన్నీ కామెంట్స్ కూడా జోడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..