ఓరీ దేవుడో.. గాలివాన బీభత్సం..! ఇంటి పైకప్పుతో ఎగిరిపోయిన చిన్నారులు
దేశవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తుపాను సమయంలో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు అమాంతంగా గాల్లోకి లేచిపోయింది. అయితే పైకప్పు ఎగిరిపోవడంతో దానిని పట్టుకుని ఉన్న చిన్న పిల్లలు కూడా పైకి లేచి

కాలా బైసాఖి తుఫాను గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్లాక్అవుట్ సమయంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్మేస్తాయి. భారీ వర్షం కురుస్తుంది. భయంకరమైన గాలి వీస్తుంది. ఉరుములు, మెరుపులు… కొన్నిసార్లు వడగళ్ళు కూడా కురుస్తాయి.. తుఫాను కారనంగా భారీ వృక్షాలు సైతం నెల కూలటం చూస్తుంటాం. చెట్లు, కొమ్మలు ఎగిరిపోవడాన్ని కూడా మనం చూశాము. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో కాలా బైసాఖి తుఫాను ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడవచ్చు…
దేశవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని సాగర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తుపాను సమయంలో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు అమాంతంగా గాల్లోకి లేచిపోయింది. అయితే పైకప్పు ఎగిరిపోవడంతో దానిని పట్టుకుని ఉన్న చిన్న పిల్లలు కూడా పైకి లేచి పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
సాగర్ ప్రాంతంలో భారీ వర్షం, ఈదుర గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులంతా ఇంటి లోపలికి పరుగెత్తారు. కొందరు చిన్నారులు ఓ గుడిసెలోనికి వెళ్లి పైకప్పును గట్టిగా పట్టుకుని ఉన్నారు. బలమైన గాలి తీవ్రతకు షెడ్డుపై వేసిన ప్లాస్టిక్ షీట్లు ఎగిరిపోయాయి. దాంతో అందులో ఉన్న పిల్లలు కూడా అమాంతంగా గాల్లోకి ఎగిరిపడ్డారు. అయితే పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




