Viral: దండిగా చేపల పడతాయని వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూడగా
చేపల కోసం వేటకు వెళ్లిన జంటకు దెబ్బకు షాక్ తగిలింది. దండిగా చేపలు పడతాయని నీటిలో గాలం వేయంగా.. వారు కాసేపటికి దాన్ని పైకి లాగి చూడగా.. చిక్కింది చూసి స్టన్ అయ్యారు. ఇంతకీ ఏం చిక్కిందంటే.. ఈ వార్తలో చూసేయండి.

కొందరు వీలు చిక్కినప్పుడల్లా సరదాకు చేపల వేటకు వెళ్తుంటారు. మన దేశంలో ఇది చాలా అరుదు గానీ.. విదేశాల్లో అయితే ఇది రొటీన్. సరే.! ఇదే క్రమంలో ఓ జంట స్థానికంగా ఉన్న సరస్సులో చేపల వేటకు వెళ్లారు. దండిగా చేపలు చిక్కుతాయ్. ఎంచక్కా చేపల పులుసు చేసుకుందామనుకున్నారు. ఓ చక్కటి బోటులో దగ్గరలోని సరస్సులోకి వెళ్లి.. నీటిలో గాలం వేశారు. దండిగా చేపలు పడతాయని కాసేపు అలా ఉంచారు.
తీరా కొద్దిసేపటి తర్వాత దాన్ని పైకి లాగి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. వారికి అరుదైన షార్క్ జాతికి చెందిన స్టుర్గొన్ అనే చేప చిక్కింది. ఈ స్టుర్గొన్ చేపలలో 28 జాతులు ఉండగా.. డైనోసర్‌ల కంటే.. అనగా సుమారు 175 మిలియన్ల పూర్వకాలం నాటి నుంచి వీటి శిలాజాలు సముద్ర గర్భంలో ఉండేవట. సుమారు 24 అడుగుల పొడవు ఉండే ఈ చేపలు.. 2900 పౌండ్ల బరువు ఉంటాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లేక్స్, సముద్ర గర్భంలో ఉంటాయి. లేట్ ఎందుకు ఆ చేపను మీరూ చూసేయండి.
View this post on Instagram
