Viral Video: ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు.. నెటిజన్స్ మనసులను హత్తుకుంటున్న బుడ్డొడు..
తాజాగా ఇద్దరు చిన్నారులకు సంబంధించిన వీడియో నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది.. వారిద్దరి మధ్య ఉన్న మధురమైన బంధానికి సంబంధించిన

మన సంతోషాలను పంచుకోవడానికి ఎందరు ఉన్నా కానీ.. మన బాధను చెప్పుకొవడానికి.. నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు ఒక్క స్నేహితుడు మాత్రం ఉండాలి.. మన కోసం ప్రాణాలిచ్చే ఫ్రెండ్ అవసరం లేదు..భరోసాగా అండగా.. ఉండే స్నేహితుడు ఉండేవారు చాలా అదృష్టవంతులు.. తాజాగా ఇద్దరు చిన్నారులకు సంబంధించిన వీడియో నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది.. వారిద్దరి మధ్య ఉన్న మధురమైన బంధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అందమైన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది..
ఆ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ప్రేమను మనం పుట్టిస్తాము… ద్వేషాన్ని నేర్చుకుంటాము.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.. అందులో కొందరు చిన్నారులు కుర్చీలపై కూర్చొని ముచ్చటిస్తుంటారు.. అందులో చివరగా ఉన్న అబ్బాయికి నిద్ర ముంచుకోస్తుండడంతో అటు ఇటు తులుతూ ఉంటాడు.. దీంతో పక్కనే ఉన్న అబ్బాయి తన స్నేహితుడికి భుజానికి అందించి సహకరించాడు.. దీంతో ఆ చిన్నారి తన ఫ్రెండ్ భుజంపై ఆదమరిచి నిద్రపోతున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.




Love is what we are born with. Hate is what we learn.❤️ pic.twitter.com/AmINRJUuqp
— Awanish Sharan (@AwanishSharan) June 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.