AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అది పిల్లి కాదు పులి.. నీళ్లు తాగుతున్న చిరుతను మొసలి ఏం చేసిందంటే..? వీడియో వైరల్..

చిరుత కొన్నింటిని తప్ప అడవిలో కనిపించే ప్రతీ జీవిని వేటాడుతుంది. కానీ చిరుతనే వేటాడితే ఎలా ఉంటుంది. అవును.. ఓ మొసలి చిరుతను వేటాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే వేటగాడు ఎంత శక్తివంతుడైనా.. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టమవుతుంది.

Viral Video: అది పిల్లి కాదు పులి.. నీళ్లు తాగుతున్న చిరుతను మొసలి ఏం చేసిందంటే..? వీడియో వైరల్..
Leopard Vs Crocodile
Krishna S
|

Updated on: Sep 21, 2025 | 11:46 AM

Share

అడవిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. బలహీనమైన జీవులు క్రూర మృగాలకు ఆహారంగా మారడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు బలమైన జంతువులు కూడా ఊహించని దాడులకు బలైపోతాయి. అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిరుత ప్రశాంతంగా నది ఒడ్డున నీరు తాగుతుండగా, నీటిలో కాపు కాసిన ఒక మొసలి దానిపై మెరుపు వేగంతో దాడి చేసింది. చిరుత చాలా అప్రమత్తంగా ఉన్నట్లు కనిపించినా మొసలిని గుర్తించలేకపోయింది. మొసలి ఒక్కసారిగా నీటిలోంచి బయటపడి చిరుతను గట్టిగా పట్టుకుంది.

కొద్దిసేపట్లోనే ఆహారంగా మారింది మొసలి పట్టు నుంచి తప్పించుకోవడానికి చిరుత తీవ్రంగా పోరాడింది. కానీ మొసలి బలం ముందు అది నిలబడలేకపోయింది. కేవలం కొన్ని సెకన్లలోనే మొసలి చిరుతను నీటి లోపలికి లాక్కెళ్లి, దాన్ని చంపి ఆహారంగా మార్చుకుంది. ఈ ఉత్కంఠను రేపే వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను @suaibansari3131 అనే యూజర్ ఎక్స్‌లో షేర్ చేయగా.. ఇది చాలా తక్కువ సమయంలో 63వేలకు పైగా వ్యూస్ సాధించింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అయ్యారు. మొసలి బలం అద్భుతం, ప్రకృతిలో జరిగే అసలైన థ్రిల్లర్, వేటగాడే బలయ్యాడు అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..