AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఐదే.. ఐదు సెకన్లు.. జంగిల్ సఫారీలో షాకింగ్ సీన్.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయంకరమైనవిగా.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ షాకింగ్ వీడియోను 'ఇన్‌స్టాగ్రామ్'లో 'wildtrails.in' హ్యాండిల్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు.

Viral Video: ఐదే.. ఐదు సెకన్లు.. జంగిల్ సఫారీలో షాకింగ్ సీన్.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2024 | 4:00 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయంకరమైనవిగా.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి దావనాలంలా వ్యాపించడం నెటిజన్లను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ షాకింగ్ ఘటన జైపూర్‌లోని ఝలానాలో చోటుచేసుకుంది. చిరుత మెరుపుదాడి చేసి కుక్కను వేటాడింది. కేవలం ఐదు సెకన్లలోనే వేటను పూర్తిచేసింది. 28 సెకన్ల వైరల్ క్లిప్‌లో చిరుతపులి.. కుక్కను వేటాడి మెడ పట్టుకుని అడవిలోకి తీసుకెళుతూ కనిపించింది.

ఈ షాకింగ్ వీడియోను ‘ఇన్‌స్టాగ్రామ్’లో ‘wildtrails.in’ హ్యాండిల్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. వైల్డ్ ట్రైల్స్. ఇన్ లో చేయడంతోపాటు.. శీర్షిక ఇలా రాశారు. “జలానా అడవి జైపూర్‌తో అనుసంధానించబడి ఉంది.. ఇక్కడ వందలాది చిరుతలు ఉన్నాయి. నగరానికి అనుసంధానించబడినందున, వీధి కుక్కలు అక్కడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.’’ అంటూ వీడియో పోస్ట్ చేశారు..

చిరుత వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో చూడండి..

ముందుగా అడవిలో కుక్క సంచరిస్తుంది.. ఈ క్రమంలో అక్కడే.. ఎండిన గడ్డిలో దాక్కున్న చిరుతపులి.. కుక్కను వెంబడించడం ప్రారంభించింది. రెప్పపాటు సమయంలో మూడు అడుగుల దూరం నుంచి కుక్కపైకి దూసుకెళ్లింది. చిరుతపులి నేరుగా కుక్క మెడపై దాడి చేసి సెకన్లలో చంపేసింది. వీడియో చివర్లో, చిరుతపులి తన నోటితో కుక్కను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్తుంది.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి.. లైకులతో పాటు కామెంట్లు చేస్తున్నారు. చిరుత వేట ఇంత ప్రమాదకరంగా ఉంటుందా..? అటవీ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?