Lazy People: మీరు బద్దకస్తులా.? అయితే మీరే తోపులట.!! తాజా సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

Lazy People: నిజం చెప్పాలంటే.. చాలా మందికి బద్దకస్తులపై ఎప్పుడూ నెగెటివ్‌ ఓపినియనే ఉంటుంది. ప్రత్యేకించి.. జంతువులతో పోలుస్తూ..

Lazy People: మీరు బద్దకస్తులా.? అయితే మీరే తోపులట.!! తాజా సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 08, 2021 | 6:47 PM

Lazy People: నిజం చెప్పాలంటే.. చాలా మందికి బద్దకస్తులపై ఎప్పుడూ నెగెటివ్‌ ఓపినియనే ఉంటుంది. ప్రత్యేకించి.. జంతువులతో పోలుస్తూ.. మరీ హేలనగా చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వైద్యుల బృందం తెలిపిన.. వివరాలను చూస్తే మాత్రం కచ్చితంగా షాక్‌కు గురవుతారు. ఇంతకీ బద్దకస్తుల గురించి బయటపడిన ఆ స్టన్నింగ్‌ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం…

ముఖ్యంగా బద్దకస్తులపై సైన్స్ ఏం చెబుతుందంటే.. ఫిజికల్‌గా, యాక్టివ్‌గా ఉండేవారి బ్రెయిన్ కంటే.. బద్ధకంగా ఉండే వారి బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుందట. జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఈ విషయం కన్ఫామ్ అయింది. బద్ధకత్వాన్ని నిర్వచించిన రీసెర్చర్లు.. ఇదొక జ్ఞానం లాంటిదని చెబుతున్నారు. బద్దకస్తులకు ఓ పనిని అప్పగించినప్పుడు.. ఆ పని నుంచి తప్పించుకోవడానికి, సులభమైన దారిని వెతుకుతుంటారు.

అంతేకాదు.. ఆ పని తక్కువ టైమ్‌లోనే అయిపోయేలా స్మార్ట్‌ థింకింగ్‌ చేస్తారని సర్వే వెల్లడించింది. ఇలా చేయడం వల్ల.. యాక్టివ్‌ పర్సన్‌ల కంటే.. వంద రెట్లు స్పీడ్‌తో వారి బ్రేన్‌ వర్క్‌ చేస్తోందని సర్వే తెలిపింది. బద్దకస్తులు చేయాలనుకున్న పనికి చాలా రకాల ఆల్‌టర్‌నేటీవ్‌ దారులు ఉంటాయని తేలింది. వారి ఇమాజినేషన్‌ లెవల్స్‌ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని స్పష్టమైంది. మొత్తానికి బద్దకస్తులపై ఇన్ని రోజుల నుంచి ఉన్న నెగెటివ్‌ వైబ్స్‌కు.. జర్నల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజీ చెక్‌ పెట్టింది.

Also Read: ‘ఎస్‌బీఐ రూపే జన్‌ధన్ కార్డు’ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ పొందండి..