కుక్కల ముందు పిల్లాడి ‘భాంగ్రా’ స్టెప్పులు.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

కుక్కలంటే కొందరికి ఎంత ఇష్టమో.. ఇంకొందరికీ అంతే భయం. ఇక ఇంట్లో పెంచుకునే కుక్కలైతే ఎవరైనా బయటి మనిషి గేటు దగ్గరకు వస్తే చాలు

  • Tv9 Telugu
  • Publish Date - 2:37 pm, Sun, 4 October 20
కుక్కల ముందు పిల్లాడి 'భాంగ్రా' స్టెప్పులు.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

Little Boy Bhangra Steps: కుక్కలంటే కొందరికి ఎంత ఇష్టమో.. ఇంకొందరికీ అంతే భయం. ఇక ఇంట్లో పెంచుకునే కుక్కలైతే ఎవరైనా బయటి మనిషి గేటు దగ్గరకు వస్తే చాలు ‘భౌ భౌ’మని అరుస్తూ, మీదికొస్తూ వారి గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంటాయి. కాగా ఓ పిల్లాడు మాత్రం గేటు లోపల ఉన్న కుక్కలను రెచ్చగొడుతూ చేస్తున్న ఓ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని నటి లావణ్య త్రిపాఠి కూడా ట్వీట్ చేశారు. గేటు లోపల రెండు కుక్కలు ఉండగా.. బయట నిల్చున్న ఆ బుడ్డోడు భాంగ్రా స్టెప్పులను వేశాడు. అవి భౌ భౌ అంటూ అరుస్తుంటే వాటిని రెచ్చగొడుతూ మధ్యలో తొడ కూడా కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరినీ ఆకట్టుకుంటోంది.

Read More:

కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి కారణాలివేనట..!

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. ఫైనల్ ఎపిసోడ్‌లకి నాగార్జున ఉండరా..!