Viral Video: మేకను కరకర నమిలి మింగేసిన రాకాసి బల్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
రాకాసి బల్లి(Komodo Dragon) అసలు ఇలాంటి జీవులు భూమిపై ఉన్నాయో లేదో తెలియదు.. కానీ ఇవి ఇండోనేషియా దీవుల్లో కనిపిస్తాయని..
రాకాసి బల్లి(Komodo Dragon) అసలు ఇలాంటి జీవులు భూమిపై ఉన్నాయో లేదో తెలియదు.. కానీ ఇవి ఇండోనేషియా దీవుల్లో కనిపిస్తాయని అంటుంటారు. బల్లి జాతికి చెందిన ఈ ప్రమాదకరమైన జీవులు.. పరిమాణంలో మొసళ్ల మాదిరిగా ఉంటాయి. ఏ జంతువునైనా మింగేసే సామర్ధ్యం ఉన్న ఈ రాకాసి బల్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ మేక పిల్లను చంపేసిన రాకాసి బల్లి.. దాన్ని అమాంతం నమిలి మింగేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కచ్చితంగా గూస్ బంప్స్ రావడం ఖాయం. మనుషులపై కూడా దాడి చేయగలిగే ఈ జంతువు వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కు గురవుతున్నారు.
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ‘wildlife_stories_’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనిని లక్షా 10 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 3.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.