Watch: ఓరీ దేవుడో ఇదేం చేపరా సామీ..! ముత్యాల్లాంటి కళ్లు.. రాక్షసుడి వంటి పళ్లతో వింత ఆకారంలో..
ఈ విశ్వంలో చాలా రకాల జీవులు ఉన్నాయి. వాటిలో భయానకంగా కనిపించేవి కూడా అనేకం ఉన్నాయి. కొన్ని వింత ఆకారాలు కలిగి ఉంటాయి. మరికొన్ని చూసేందుకు అద్భుతంగా ఉంటాయి. అరుదైన జీవులలో ఎక్కువ భాగం నీటి లోపల నివసించేవే. వివిధ రకాల చేపలు, ఇతర జీవులు నీటిలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అలాంటివి ఈ భూమిపై ఇంకా చాలా రకాల జీవులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతారు. కానీ, ఇటీవల కనిపెట్టిన ఈ సముద్ర జీవి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఒకింత భయపెట్టింది. ఈ జీవి కళ్ళు అందమైన ముత్యం లాంటివి..కానీ, దాని దంతాలు మాత్రం రాక్షసుడిలా ఉన్నాయి. ఈ జీవి ఏమిటో తెలుసుకుందాం?

వెన్నెముకలో వణుకు పుట్టించే అరుదైన లోతైన సముద్ర జీవి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ జీవి దంతాలు రాక్షసుడిలా పదునైనవిగా, వంకరటింకరగా ఉన్నాయి. కానీ, దాని కళ్ళు మాత్రం ముత్యాల వలె ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. పెద్ద సైజు ముత్యాల లాంటి కళ్ళతో దూరం నుండి దాని ఎరను గుర్తించగలదు.. కాబట్టి శాస్త్రవేత్తలు దీనికి టెలిస్కోప్ ఫిష్ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ జీవి కళ్ళు బయో-కాంతిమను గ్రహించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.. ఈ జీవి తన కళ్ళ నుండి కాంతిని ఉత్పత్తి చేయగలదు. తద్వారా సముద్రంలోని దట్టమైన చీకటిలో కూడా చాలా దూరం సులభంగా చూడగలదు. ఈ జీవి 500 నుండి 3000 మీటర్ల లోతులో నివసిస్తుంది.
టెలిస్కోప్ చేప తన గొట్టం లాంటి కళ్ళలో కాంతిని నిల్వ చేయగలదు. ఇది ఎరను కనుగొనడంలో సహాయపడుతుంది. దాని శరీరం పొడవుగా, సన్నగా ఉంటుంది. తెలుపు- గోధుమ రంగులో ఉంటుంది. ఈ వైరల్ వీడియోలో టెలిస్కోప్ చేప బెలూన్ లాంటి కళ్ళు, పదునైన దంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూసేందుకు ఇది చాలా భయంకరంగా ఉంటుంది.
వీడియో ఇక్కడ చూడండి..
Telescopefish, a rare deep-sea creature known for its eyes adapted for spotting bioluminescence
— Science girl (@gunsnrosesgirl3) July 31, 2025
ఈ ప్రత్యేకమైన సముద్ర జీవి వీడియోను @gunsnrosesgirl3 అనే హ్యాండిల్ ఎక్స్‌ఖాతాలో షేర్ చేశారు.. దీనిని ఇప్పటివరకు 20 మిలియన్లకు పైగా వీక్షించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ తిన్నామంటూ కామెంట్ చేశారు. చాలా మంది నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ టెలిస్కోప్ చేపల ఆవిష్కరణను శాస్త్రవేత్తలు చాలా ఉత్తేజకరమైనదిగా అభివర్ణించారు. ఇలాంటి జీవుల ఆవిష్కరణ సముద్రపు లోతుల్లో దాగి ఉన్న మరిన్ని రహస్యాలను వెల్లడించగలదని వారు విశ్వసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




