షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్
డబ్బు కోసం గాళ్‌ఫ్రెండే తన బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన సంచలన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఈ డ్రామాలో దుబాయ్‌లో ట్రావెల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేసే లారెన్స్ మెల్విన్ బాధితుడిగా మారాడు. లారెన్స్ ఇటీవలే సెలవు మీద దుబాయ్ నుంచి తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చాడు. అయితే, జూలై 16వ తేదీ నుంచి అతను కనిపించకుండా పోవడం, తమ అధీనంలో ఉన్న అతడిని విడిపించాలంటే రూ. 2.5 కోట్లు ఇవ్వాలంటూ అతని కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్లు రావటంతో లారెన్స్ తల్లి అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు సంగతి తెలిసి షాకయ్యారు. లారెన్స్ గర్ల్ ఫ్రెండ్ మహిమ ఈ కిడ్నాప్ చేయించిందని వారు నిర్ధారించారు. జూలై 14న మహిమ బయటకు వెళ్దామని చెప్పడంతో లారెన్స్ ఆమెతో కలిసి కారు బుక్ చేసుకుని బయటికి వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక ఆ డ్రైవర్ కారును దారి మళ్లించటం, ఈ లోగా మరో ఇద్దరు వ్యక్తులు కారులో చొరబడి.. లారెన్స్‌పై దాడి చేసి.. అతడి వద్దనున్న లక్ష రూపాయల నగదును లాక్కున్నారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత.. లారెన్స్‌ను ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించి, దాదాపు ఎనిమిది రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని వారు వెల్లడించారు. మహిమా ప్లాన్ ప్రకారం.. వారు లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి రెండున్నర కోట్లు డిమాండ్ చేశారు.అయితే, లారెన్స్ ను బంధించిన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక మహిళ.. మహిమ, ఆమె అనుచరుల రాకపోకలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. లారెన్స్‌ను సురక్షితంగా కాపాడారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రధాన కుట్రదారుగా గుర్తించిన మహిమతో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరదల్లో కొట్టుకుపోయిన 20 కోట్ల నగలు.. ఎగబడిన జనం
9 గంటలకు పైగా నిద్రపోతే.. చావు మూడినట్లేనా?
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

