AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే

కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే

Phani CH
|

Updated on: Aug 05, 2025 | 5:27 PM

Share

ప్రపంచంలోనే ఎంతో విలువైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. శతాబ్దాల కాలంలో అనేక చేతులు మారి చివరకు లండన్ చేరింది. గుంటూరు జిల్లాలో దొరికిన ఈ వజ్రం.. కాకతీయుల నుంచి బ్రిటిషర్ల వరకు ఎందరి చేతులో మారి.. చివరికి ఇప్పుడు లండన్ చేరింది. అయితే, పురుషులు దీనిని ధరిస్తే అరిష్టమని, మహిళలకు మాత్రం ఇది బాగా కలిసొచ్చిందని చరిత్ర చెబుతోంది.

కోహినూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తన తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని ధరించిన సంగతి తెలుసుకున్న.. పర్షియన్ రాజు నాదర్ షా దానిని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు. అప్పట్లో రాజులు కలుసుకుంటే.. ఒకరి తలపాగాలు మరొకరిని ఇచ్చుకునే సంప్రదాయం ఉండటంతో.. మహమ్మద్ షా తలపాగాను నాదిర్ షా అందుకున్నాడు. దానితో బాటే కోహినూర్ కూడా అతని వశమైంది. అయితే కోహినూర్ వజ్రం రాజులకు కలసి రాలేదని రోయినా గ్రేవాల్ అనే రచయిత.. తన పుస్తకం ‘ఇన్ ది షాడో ఆఫ్ ది తాజ్, ఎ పోర్ట్రెయిట్ ఆఫ్ ఆగ్రా’లో చెప్పుకొచ్చారు. కోహినూర్ దక్కించుకున్న నాదర్ షా హత్యకు గురికావటం, అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా చనిపోవటం, అతని మనవడు షారుఖ్, కోహినూర్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షాకు అప్పగించవలసి రావటం, కోహినూర్‌ను దక్కించుకున్న అహ్మద్ షా కూడా అకాల మరణం పాలవటం, షా కుమారుల మధ్య విభేదాలతో ఆ వజ్రం రంజిత్ సింగ్ వశం కావటం వంటి అనేక పరిణామాలను రోయినా గ్రేవాల్ తన పుస్తకాలలో వివరించారు. తర్వాత.. రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం పోటీ, అతని కుమారుడి ద్వారా ఆ వజ్రం.. బ్రిటిషర్ల వశం కావటం.. తర్వాత దానిని బ్రిటన్ రాజవంశంలోని పలువురు రాణులు ధరించటం వంటి ఘట్టాలను ఆమె వివరించారు. అయితే, మొత్తం చరిత్రను పరిశీలిస్తే.. అది పురుషులకు అరిష్టంగా, మహిళలకు అదృష్టంగా మారిందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sania Mirza: అతనితో రొమాన్స్ కి రెడీ అంటున్న సానియా మీర్జా

రీల్స్ పిచ్చి తో హత్యలు కూడా చేస్తున్నారా ?? చివరికి తోడబుట్టిన అక్కని కూడా!

పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు

ఆఫీస్‌ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన టెకీ

కంటి చూపుతోనే పేమెంట్స్..! UPI కొత్త ఫీచర్..