Viral Video: కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో చూస్తే ముచ్చెమటలే..
హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో అక్కడున్న వారు.. ఉరుకులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది.. అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కు చుక్కలు చూపించింది. అది తిరగబడటంతోపాటు.. బుసలు కొడుతూ అందరినీ షేక్ చేసింది.

హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో అక్కడున్న వారు.. ఉరుకులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది.. అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కు చుక్కలు చూపించింది. అది తిరగబడటంతోపాటు.. బుసలు కొడుతూ అందరినీ షేక్ చేసింది. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం హరిద్వార్‌లోని చండి ఘాట్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున 13 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా కనిపించింది.. ఇది స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పామును చూసి స్థానికులు ఆందోళన చెందారు.. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అనంతరం ఒక రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు గంటసేపు ఆపరేషన్ తర్వాత, కింగ్ కోబ్రాను సురక్షితంగా పట్టుకుంది.
వీడియో వైరల్..
ఆ పాము దాదాపు 13-15 అడుగుల పొడవు ఉండటంతోపాటు.. చాలా చురుకైన స్థితిలో ఉంది. స్థానిక నివాసితుల సహాయంతో రెస్క్యూ బృందం గంగా నది ఒడ్డున పామును విజయవంతంగా రక్షించింది. అటవీ శాఖ సిబ్బంది ఆపరేషన్ అంతటా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ పైకి దూసుకువచ్చింది.. చాలా సేపు అలానే మీదకు దూసుకువచ్చింది.. దీంతో స్నేక్ క్యాచర్ చాకచక్యంగా వ్యవహరించి భారీ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు.
King Cobra Creates Panic in Kankhal, Rescued by Forest Department
An angry and ferocious King Cobra created panic in the Lakkar Basti area of Kankhal Bairagi Camp on Sunday. Locals were terrified after spotting the massive and aggressive snake slithering through the settlement.… pic.twitter.com/z8drKSDwNM
— Kumaon Jagran (@KumaonJagran) October 26, 2025
రెస్క్యూ తర్వాత, నాగుపాము రాజాజీ టైగర్ రిజర్వ్‌లోని మానవ నివాసాలకు దూరంగా అడవిలో విడిచిపెట్టబడింది. మొత్తం రెస్క్యూ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అటవీ శాఖ విజ్ఞప్తి..
ఎక్కడైనా పాములను.. ఇలాంటి అడవి జంతువులను చూసినట్లయితే స్వయంగా ఎటువంటి చర్య తీసుకోవద్దని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే శాఖకు తెలియజేయాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
