AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు తింటున్నారా జాగ్రత్త! గొంతులో ముల్లు ఇరుక్కుందని కంగారు పడకండి.. ఈ సులువైన చిట్కాలతో ఈజీగా బయటపడండి!

చేపలు తినేటప్పుడు ఒక్కోసారి పొరపాటున ముల్లు గొంతులో ఇరుక్కుపోవడం సహజం. ఇది తీవ్రమైన అసౌకర్యాన్ని, నొప్పిని కలిగిస్తుంది. ఇలాంటప్పుడు కంగారు పడకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో తక్షణ ఉపశమనం పొందవచ్చు. సింపుల్‌, ఈజీగా ఉండే, కొన్ని వంటింటి చిట్కాల ద్వారా గొంతులో ఇరుక్కున్న ముల్లును సురక్షితంగా తొలగించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ ఊద్దాం..

చేపలు తింటున్నారా జాగ్రత్త! గొంతులో ముల్లు ఇరుక్కుందని కంగారు పడకండి.. ఈ సులువైన చిట్కాలతో ఈజీగా బయటపడండి!
Fish Thorn Struck At Throat
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2026 | 8:48 AM

Share

చేపల వంటకాలను ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా మృగశిర కార్తె వంటి సమయాల్లో ప్రతి ఇంట్లోనూ చేపల ఘుమఘుమలు కనిపిస్తాయి. అయితే, చేపలు తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా తిన్నా, చిన్న ముల్లు పొరపాటున గొంతులో ఇరుక్కుపోతుంది. అది గొంతులో గుచ్చుకుంటూ తీవ్రమైన నొప్పిని, మింగడానికి ఇబ్బందిని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలా మంది భయపడిపోతుంటారు. కానీ, కంగారు పడకుండా మన వంటింట్లోనే ఉండే కొన్ని వస్తువులతో ఈ సమస్య నుండి క్షణాల్లో ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం.

అరటిపండు తినడం (Banana Remedy): గొంతులో ముల్లు ఇరుక్కున్నప్పుడు అరటిపండు ఒక అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. ఒక పెద్ద అరటిపండు ముక్కను తీసుకుని, దానిని ఎక్కువగా నమలకుండా ఒకేసారి మింగడానికి ప్రయత్నించండి. అరటిపండులో ఉండే జిగురు గుణం వల్ల గొంతులో ఇరుక్కున్న ముల్లు దానికి అంటుకుని, నేరుగా కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులోని యాసిడ్ల వల్ల ఆ ముల్లు సులభంగా జీర్ణమైపోతుంది.

అన్నం ముద్ద (Rice Ball): ఇది మన పెద్దల కాలం నుండి వస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన చిట్కా. కొద్దిగా వైట్ రైస్ (మెత్తటి అన్నం) తీసుకుని చిన్న లడ్డులా గట్టి ముద్దగా చేయండి. ఈ అన్నం ముద్దను నమలకుండా నేరుగా మింగేయాలి. అన్నం ముద్ద కిందకు వెళ్లేటప్పుడు గొంతుకు గుచ్చుకున్న ముల్లును కూడా తనతో పాటు కడుపులోకి లాక్కెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆలివ్ ఆయిల్ (Olive Oil): ఇంట్లో ఆలివ్ ఆయిల్ అందుబాటులో ఉంటే, ఒకటి లేదా రెండు చెంచాల నూనెను నేరుగా తాగండి. ఆలివ్ ఆయిల్ ఒక లూబ్రికెంట్‌లా పనిచేస్తుంది. ఇది గొంతు భాగంలో నునుపుదనాన్ని కలిగించడం ద్వారా ఇరుక్కున్న ముల్లు సులభంగా జారి కిందకు వెళ్ళిపోయేలా చేస్తుంది.

నిమ్మరసం, గోరువెచ్చని నీరు: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తాగండి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ గుణం వల్ల గొంతులో ఉన్న చిన్నపాటి ముల్లు మెత్తబడి, గొంతు నుండి సులభంగా విడిపోతుంది.

బ్రెడ్, పాలు (Bread and Milk): ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని దానిని కొద్దిగా పాలలో లేదా నీళ్లలో ముంచండి. అది కాస్త నానిన తర్వాత ముద్దగా చేసి మింగేయండి. బ్రెడ్ బరువు, జిగురుకు ముల్లు ఊడి వచ్చేస్తుంది.

ఈ చిట్కాలు సాధారణ, చిన్న ముల్లులు ఇరుక్కున్నప్పుడు అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ ముల్లు చాలా పెద్దదై ఉండి, ఈ చిట్కాలు పాటించినా రాకపోతే లేదా గొంతులో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈఎన్‌టీ (ENT) వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..