AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలం అయినా.. వర్షాకాలం అయినా.. దీన్ని కొట్టే మొనగాడు ఫుడ్ లేనేలేదు మావ.. ఈ సీజన్‌లో..

వర్షాకాలం రోగాల బారి నుండి కాపాడే ఆరోగ్యకరమైన రాగి అంబలిని తీసుకోవడం చాలా మంచిది. ఈ అంబలి జీర్ణక్రియకు అత్యంత మేలు చేస్తుంది, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, వెంట్రుకలు, చర్మానికి కూడా ఆరోగ్యాన్నిస్తుంది. రాగిలో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి..

ఎండాకాలం అయినా.. వర్షాకాలం అయినా.. దీన్ని కొట్టే మొనగాడు ఫుడ్ లేనేలేదు మావ.. ఈ సీజన్‌లో..
Ragi Malt Recipe Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jun 07, 2026 | 8:48 AM

Share

వర్షాకాలం ప్రారంభమైంది.. అయితే, వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినడం ద్వారా.. ఆరోగ్యంగా ఉండొచ్చరు.. ఇంకా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవచ్చు.. అలాంటి అద్భుతమైన ఆహారాల్లో రాగి అంబలి ఒకటి.. ఈ సాంప్రదాయ, పోషకమైన పానీయం రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాగి అంబలి తయారీ విధానం:

రాగి అంబలిని తయారు చేయడం చాలా సులభం. రెండు స్పూన్ల రాగి పిండిని తీసుకుని, తగినన్ని నీళ్లు కలిపి ఉండలు లేకుండా నిదానంగా కలపాలి. వేడి నీళ్లు వాడడం ద్వారా ఉండలు ఏర్పడకుండా, త్వరగా కలుస్తుంది. దీనిని రాత్రి పడుకునే ముందు తయారు చేసుకోవాలి. ఉడికించేటప్పుడు మట్టి కుండను ఉపయోగించడం వల్ల రుచి మెరుగుపడటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. మట్టి కుండను తక్కువ నుండి మధ్యస్థ మంటపై వాడాలి, ముఖ్యంగా కొత్త కుండల విషయంలో. కొద్దిగా ఉప్పు చేర్చి, పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత, అంబలిని చల్లబరచాలి. చల్లబడిన తర్వాత, మూత పెట్టి, దానిపై ఒక కాటన్ బట్టతో కప్పి రాత్రంతా పులియబెట్టాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు, రాత్రంతా నిల్వ ఉంచిన అంబలిలో చల్ల (మజ్జిగ) కలిపి తీసుకోవాలి. కొందరు చిక్కగా ఇష్టపడతారు, కొందరు పలుచగా ఇష్టపడతారు కాబట్టి, నీరు లేదా చల్ల పరిమాణాన్ని వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవచ్చు. కావాలంటే, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, నెయ్యి వంటివి చేర్చుకుని మరింత రుచిగా, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

రాగి అంబలి జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది గట్ హెల్త్‌కు అద్భుతమైనది. ముఖ్యంగా పులియబెట్టిన రూపంలో ఉండడం వల్ల. గట్ ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి, ఆలోచనలకు కూడా మూలమని ఆయుర్వేద, ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల వేసవి కాలంలో కూడా ఇది ప్రయోజనకరమైనది. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. రాగి కాల్షియం, ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, కండరాల బలానికి తోడ్పడుతుంది. పాలిచ్చే తల్లులకు ఇది అదనపు పోషణను అందిస్తుంది. వెంట్రుకలు, చర్మ సౌందర్యానికి కూడా రాగి అంబలి ప్రయోజనకరంగా ఉంటుంది.

ముఖ్యమైన ఆరోగ్య సలహాలు

అయితే.. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందరికీ ఒకే విధంగా పని చేయకపోవచ్చు. ఉదాహరణకు, కిడ్నీ బీన్స్ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, కొంతమందికి గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి, మన శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి, దానికి తగ్గట్టుగా ఆహారాన్ని ఎంచుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు రాగిని రోజూ కాకుండా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని, కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.

వంటపాత్రల ఎంపిక:

వంటపాత్రల ఎంపిక కూడా ఆహారం పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. రాగి అంబలికి మట్టి కుండలు అత్యంత ఆరోగ్యకరమైనవి. ఇవి 100% పోషకాలను నిలుపుకుంటాయి. స్టీల్ పాత్రలు 80% పోషకాలను నిలుపుకుంటాయి. వాటిని వాడుకోవచ్చు.

ముగింపుగా, ఈ రాగి అంబలి రెసిపీ సులభమైనది.. రుచికరమైనది.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వర్షాకాలంలో, అలాగే ఏడాది పొడవునా మీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం, జీర్ణక్రియ, మొత్తం శ్రేయస్సును పొందవచ్చు. టేస్ట్ విషయంలో రాజీ పడకుండా, ఆరోగ్యం కోసం రుచికరమైన ఆహారాన్ని ఇలా నిమిషాల్లోనే తయారు చేసుకోని ఆస్వాదించండి. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

Dry Fish: ఎండు చేపలతో ఈ వ్యాధులకు బై బై చెప్పొచ్చు.. అలాంటి వారు మాత్రం తినకూడదు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

Follow Us