AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కడంతో.. ఆ తర్వాత సీన్ చూస్తే..

child trapped in elevator: అమ్మ ప్రేమకు, ఆప్యాయతకు సరిహద్దులు లేవని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీయకుండా, ఆ తల్లి చూపిన చొరవ, ప్రేమ నెటిజన్ల మనసులను గెలుచుకుంది. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తూనే, మాతృత్వం గొప్పతనాన్ని ఈ వైరల్ పోస్ట్ మనకు గుర్తుచేస్తోంది.

Video: తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కడంతో.. ఆ తర్వాత సీన్ చూస్తే..
Child Trapped In Elevator
Venkata Chari
|

Updated on: Jun 07, 2026 | 8:41 AM

Share

Child Trapped in Elevator: ఆధునిక జీవనశైలిలో అపార్ట్‌మెంట్‌లు, షాపింగ్ మాల్స్, ఆఫీసుల్లో లిఫ్ట్ (ఎలివేటర్) వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే, చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు లిఫ్ట్‌ల దగ్గర ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్) లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒక చిన్నారి పొరపాటున క్లోజ్ బటన్ నొక్కడం వల్ల తల్లి నుంచి వేరుపడి, లిఫ్ట్ లోపల ఒంటరిగా భయాందోళనకు గురైన దృశ్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. అదే సమయంలో, తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి చూపించిన సమయస్ఫూర్తి, అమ్మ ప్రేమలోని అనంతమైన శక్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

అసలేం జరిగింది? ఆందోళన కలిగించిన ఆ క్షణాలు..

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఒక తల్లి తన చిన్న కుమార్తెతో కలిసి బిల్డింగ్‌లోని ఎలివేటర్ వైపు వచ్చింది. ఇద్దరూ కలిసి లోపలికి ప్రవేశించారు. తము చేరుకోవాల్సిన స్థానానికి చేరుకున్నారు. ముందుగా తల్లి తన చేతిలో సామాన్లను బయటపెట్టేందుకు వచ్చింది. ఆవెంటనే చిన్నారి కుతూహలంతో లిఫ్ట్ కంట్రోల్ ప్యానెల్ వైపు వెళ్లింది. అక్కడ ఉన్న బటన్లను చూస్తూ, అనుకోకుండా ‘డోర్ క్లోజ్’ (Door Close) బటన్‌ను ప్రెస్ చేసింది.

తల్లి ఇంకా పూర్తిగా లిఫ్ట్ లోపలికి రాకముందే తలుపులు వేగంగా మూసుకుపోయాయి. క్షణాల వ్యవధిలో ఆ చిన్నారి లోపల ఒంటరిగా ఉండిపోగా, తల్లి బయటే ఉండిపోయింది. ఈలోపు చిన్నారి భయాందోళనతో కేకలు పెడుతూ కన్నీళ్లు పెట్టడం సీసీటీవీలో రికార్డ్ అయింది. కదలడం ప్రారంభించడంతో ఆ చిన్నారి తీవ్రమైన భయాందోళనకు లోనైంది. ఏం చేయాలో పాలుపోక, ఏడుస్తూ లిఫ్ట్ తలుపులను బాదడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆ చిన్నారి ముఖంలో కనిపించిన భయం, ఒంటరితనం ఎవరినైనా కలచివేస్తుంది.

అమ్మ ప్రేమ అమోఘం: సమయస్ఫూర్తితో వ్యవహరించిన తల్లి..

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే కంగారుపడిపోతారు. కానీ, ఆ తల్లి మాత్రం తన భయాన్ని పక్కన పెట్టి, బిడ్డను రక్షించుకోవాలనే పట్టుదలతో వ్యవహరించింది. అయితే, లక్కీగా లిఫ్ట్ ని మళ్లీ అదే ఫ్లోర్ కి వచ్చేలా బటన్ నొక్కింది.బిడ్డ ఒంటరిగా పడుతున్న ఆరాటాన్ని, భయాన్ని మానసికంగా గ్రహించిన ఆ తల్లి, లిఫ్ట్ తలుపులు తెరుచుకునే సరిగ్గా అక్కడే ప్రత్యక్షమైంది.

తలుపులు తెరుచుకోగానే ఎదురుగా నిలబడి ఉన్న తల్లిని చూసిన ఆ చిన్నారి, ఒక్క ఉదుటున ఆమె కౌగిట్లోకి చేరిపోయింది. తల్లి స్పర్శ తగలగానే ఆ పాప ఏడుపు ఆగిపోయింది. బిడ్డను గుండెలకు హత్తుకుని ఆ తల్లి ఓదార్చిన తీరు, “అమ్మకు అన్నీ తెలుసు.. అమ్మ ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టదు” అనే నమ్మకాన్ని నిజం చేసింది.

సోషల్ మీడియాలో ప్రజల స్పందనలు..

ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్లతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు:

అమ్మ ప్రేమకు సాటిలేదు: “అమ్మలు నిజంగానే అద్భుతమైనవారు. పిల్లల మనసును, వారి అవసరాన్ని వారు మాటల్లో చెప్పకపోయినా అర్థం చేసుకోగల శక్తి కేవలం అమ్మకు మాత్రమే ఉంటుంది” అని ఒక నెటిజన్ ఎమోషనల్ కామెంట్ చేశారు.

హృదయం ద్రవించిపోయింది: మరికొందరు స్పందిస్తూ.. “ఆ పాప ఒంటరిగా లిఫ్ట్‌లో భయపడినప్పుడు మాకు కూడా గుండె ఆగినంత పనైంది. కానీ చివర్లో తల్లిని చూసి ఆమె ఒడిలోకి చేరినప్పుడు కలిగిన ఉపశమనం మాటల్లో చెప్పలేము” అని రాసుకొచ్చారు.

తల్లిదండ్రులకు హెచ్చరిక: ఈ వీడియో కేవలం ఒక ఎమోషనల్ క్లిప్ మాత్రమే కాదు, తల్లిదండ్రులకు ఒక పెద్ద పాఠం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చిన్న పిల్లలను లిఫ్ట్ బటన్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి
పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి
లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు
లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!