Viral: 2 రోజులుగా ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

|

Jul 15, 2024 | 8:38 PM

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. ఆస్పత్రికి వెళ్లిన సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఎన్నిసార్లు హెల్ప్.. హెల్ప్.. అంటూ అరిచినా.. అతడి ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు.

Viral: 2 రోజులుగా ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే
Lift
Follow us on

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. ఆస్పత్రికి వెళ్లిన సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఎన్నిసార్లు హెల్ప్.. హెల్ప్.. అంటూ అరిచినా.. అతడి ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు. అతడు ఆస్పత్రికి వెళ్లింది శనివారం కావడంతో చాలామంది సిబ్బంది సెలవులో ఉన్నారు. దీంతో బాధితుడు లిఫ్ట్‌లో ఇరుక్కున్న విషయం ఆస్పత్రిలో ఎవరికి తెలియలేదు. 2 రోజులుగా లిఫ్ట్‌లో అల్లాడిన వ్యక్తి ఎట్టకేలకు సోమవారం ఉదయం లిఫ్ట్‌ నుంచి బయటపడ్డాడు. సోమవారం ఉదయం తమ రోజువారీ పనుల నిమిత్తం వచ్చిన సిబ్బందికి లిఫ్ట్‌లో ఎవరో చిక్కుకున్నట్లు గుర్తించారు. అనంతరం లిఫ్ట్‌ను ఆపరేట్‌ చేసి వారిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

ఇది చదవండి: పెదవుల ఆకారం మీ స్వభావం, వ్యక్తిత్వాన్ని చెబుతుందట.. ఎలాగో తెల్సా

ఉల్లూరుకు చెందిన రవీంద్రన్ నాయర్(59) శనివారం తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఓపీ బ్లాక్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. “అతడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కగా.. లిఫ్ట్ మధ్యలోనే డౌన్ అయింది. ఆ తర్వాత తెరుచుకోబడలేదు.దీంతో భయాందోళనకు గురైన సదరు వ్యక్తి సాయం కోసం కేకలు వేశాడు. అయితే అది ఎవ్వరికీ వినబడలేదు. అలాగే ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది” అని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సోమవారం తెల్లవారుజామున లిఫ్ట్‌ ఆపరేటర్లు రోజూవారి పనులు ప్రారంభించడానికి వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆ వ్యక్తి కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ వ్యక్తి ఆసుపత్రికి వచ్చి.. ఆ తర్వాత కనిపించకుండాపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది చదవండి: మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా.. ఈ లక్షణాలు కనిపిస్తే

సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి చెందిన ఆపరేటర్‌ లిఫ్ట్‌ తెరిచి చూడగా అందులో అపస్మారక స్థితిలో సదరు వ్యక్తి కనిపించాడు. వెంటనే అతనికి వైద్య చికిత్స అందించారు. షాక్‌కు గురై 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్నునొప్పికి చికిత్స చేయించుకునేందుకు రవీంద్రన్ శనివారం ఉదయం ఎంసీహెచ్‌లోని ఆర్థోపెడిక్ విభాగానికి వచ్చారు. డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్న తర్వాత కొన్ని వైద్య రికార్డులను తీసుకుని ఇంటికి వెళ్లాడు.

శనివారం మధ్యాహ్నం రవీంద్రన్ తిరిగి వచ్చి ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనలో, రవీంద్రన్ మొబైల్ ఫోన్ విరిగిపోయింది. దీంతో అతడు ఎవరిని సంప్రదించలేకపోయారు. “నేను అలారం బటన్‌ని నొక్కాను, కానీ ఎవరూ రాలేదు. నేను ఎమర్జెన్సీ ఫోన్‌ను కూడా లిఫ్ట్‌లో ప్రయత్నించాను, కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు,” అని బాధితుడు పేర్కొన్నాడు.

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి