Viral Video: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా..మరికొన్ని షాకింగ్ కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో పెళ్లి కూతుర్లు..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా..మరికొన్ని షాకింగ్ కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో పెళ్లి కూతుర్లు.. తమ కాబోయే భర్త కోసం ఎంతో అందమైన కానుకలను ఇస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రం.. తమకు కాబోయో భర్తపై ఇష్టాన్ని డ్యాన్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కూతుర్లు మండపంలో డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పాటకు తమ స్టైల్లో డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించుకుంటున్నారు. ఆ మధ్య కాలంలో నెట్టింట్లో సూపర్ హిట్ అయిన బుల్లె్ట్టు బండి పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది ఓ పెళ్లి కూతురు. తాజాగా కేరళకు చెందిన మరో పెళ్లి కూతురు కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న చకా చక్ పాటకు అందంగా స్టెప్పులేసింది.
కేరళకు చెందిన ఓ వధువు.. తనకు కాబోయే భర్త కోసం మండపంలో బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ చకా చక్ పాటకు అందంగా డ్యాన్స్ చేసింది. ఆకస్మాత్తుగా పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో వరుడు షాక్ అయి అలాగే చూస్తుండిపోయాడు. వధువుతోపాటు.. ఆమె స్నేహితులు సైతం ఆమెతో అందుగా కాలు కదిపారు. ఎంతో సంతోషంగా అందంగా చకా చక్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 4 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. వధువు డ్యాన్స్ చూసిన నెటిజన్స్ వావ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఆత్రంగి రే సినిమాలోనిది ఈ పాట. ఇందులో చకా చక్ అంటూ సారా అలీ ఖాన్ చేసిన డ్యాన్స్ కు నెటిజన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పాట తెగ ట్రెండ్ అవుతుంది.
View this post on Instagram
Also Read: Keerthy Suresh: ఫాలోవర్లకు ఛాలెంజ్ చేసిన కళావతి.. అదుర్స్ అనిపిస్తున్న కీర్తి సురేష్ వీడియో..
Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..
Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..