Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాజీ సీఎం వీడియో.. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..!
Viral Video: ఆయనొక ప్రజాప్రతినిధి. సాధాసీతా నాయకుడు కూడా కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి.. దేశ వ్యాప్తంగా పేరున్న నాయకుడు.
Viral Video: ఆయనొక ప్రజాప్రతినిధి. సాధాసీతా నాయకుడు కూడా కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి.. దేశ వ్యాప్తంగా పేరున్న నాయకుడు. అలాంటి నేతలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మాజీ ముఖ్యమంత్రిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కళ కూడా ఉందా అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఆ వీడియోలో ఏముంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మైసూరులోని తన స్వగ్రామమైన సిద్ధరమణ హుండీలో సిద్దరామయ్య గ్రామస్తులతో కలిసి జానపద నృత్యం చేసి అదరహో అనిపించారు. గ్రామస్తులతో కలిసి డ్యాన్స్ చేసిన ఆయన.. పాటకు తగట్టుగా పదం కదుపుతూ హోరెత్తించారు. సిద్ధరామయ్యలో ఈ కళ కూడా ఉందని చాలా మందికి తెలియదు. కానీ, ఆయన తన చిన్నతనంలో ఈ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, ఈ వీడియోను.. సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతిద్ర సిద్ధరామయ్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. సిద్ధరామయ్య స్వగ్రామంలో మూడు రోజులు పాటు సిద్ధరామేశ్వర జాతర జరిగింది. ఈ జాతరలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. జాతరలో భాగంగా నిర్వహించే ‘జాత్రే’ వేడుకలో సిద్ధరామయ్య తన చిన్ననాటి స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. వారితో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తనయుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘మా గ్రామంలో మూడు రోజుల పాటు సిద్ధరామేశ్వర జాతర జరుగుతుంది. మా కుల దైశం సిద్ధరామేశ్వరుడు. మాన నాన్న పేరు సిద్ధరామ గౌడ. మా కుటుంబం తరతరాలుగా సిద్ధరామేశ్వరుడిని పూజిస్తూ వస్తోంది.’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు పాఠశాలకు వెళ్లమని ప్రోత్సహించలేదు. నా తండ్రి నన్ను సిద్ధరమణ హుండీలోని జానపద నృత్య బృందంలో వీర మక్కల కుణితంలో చేర్పించారు. కళలు నేర్చుకోవాలని భాగా ప్రోత్సహించారు. తనకు కన్నడలో చదవడం, రాయడం నేర్పింది కూడా డ్యాన్స్ మాస్టారే’’ అని చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య.
ನಮ್ಮೂರಿನ ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ ದೇವರ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ತಂದೆಯವರು ಸಂಗಡಿಗರೊಂದಿಗೆ ವೀರಕುಣಿತದ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಕ್ಷಣಗಳು pic.twitter.com/GjMv5v4oeA
— Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) March 24, 2022
Also read:
Caste Change: ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు కులాన్ని మార్చుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది..?