- Telugu News Photo Gallery Bengaluru fashion designer forever Naveen Kumar won title in Glitz and Glitter Season 2 International Fashion Competition
International Fashion Show 2022: అంతర్జాతీయ రెడ్ కార్పెట్ ఫ్యాషన్ షోలో టైటిల్ గెలుచుకున్న బెంగళూరు డిజైనర్!
గ్లిట్జ్ అండ్ గ్లిట్టర్ సీజన్ 2 ఇంటర్నేషనల్ ఫ్యాషన్ కాంపిటీషన్ ఇటీవల దుబాయ్ (Dubai)లో అంగరంగ వైభవంగా జరిగింది..
Updated on: Mar 25, 2022 | 7:49 PM

Glitz and Glitter Season 2 International Fashion Competition 2022: గ్లిట్జ్ అండ్ గ్లిట్టర్ సీజన్ 2 ఇంటర్నేషనల్ ఫ్యాషన్ కాంపిటీషన్ ఇటీవల దుబాయ్ (Dubai)లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇన్విక్టా ట్రియోతో కలిసి నిర్వహించిన ఈ కలర్‌ఫుల్ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆ విశేషాలు మీకోసం..

కేరళకు చెందిన శరత్ చంద్రన్ దుబాయ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, దుబాయ్ టూరిజం మంత్రి ప్రారంభించారు. కన్నడ నటి సంహితా విన్య, కర్ణాటక డిజైనర్ ఫరెవర్ నవీన్ కుమార్ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు.

అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌కు జర్మనీ, స్పెయిన్, స్వీడన్, రష్యాతో సహా మొత్తం 16 దేశాలకు చెందిన డిజైనర్లు పాల్గొన్నారు.

వీరిలో మనదేశానికి చెందిన డిజైనర్ ఫరెవర్ నవీన్ కుమార్ 'ఇంటర్నేషనల్ సెలబ్రిటీ డిజైనర్' టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

షో స్టాపర్ టైటిల్‌ను నటి సంహితా విన్యా, ఇషా ఫర్హా ఖురేషి సాత్ చేతుల మీదుగా నవీన్‌కు బహుకరించారు. కాగా సంహితా విన్యా కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించగా, ఇషా 2018లో మిస్ యూనివర్స్ సాలిడారిటీ అవార్డును అందుకుంది.

ఈ ఏడాదికిగానూ రెడ్ కార్పెట్ వేర్ కోసం నవీన్ కుమార్ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఫెదర్ వింగ్స్, ఐ ఫ్యాషన్ దుస్తులను కొలంబోలోని మెట్ గాలాలో జరిగిన ఆసియా స్టార్ గాలా ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రదర్శించారు.

ఫరెవర్ నవీన్ కుమార్ గా పేరుగాంచిన నవీన్ స్వస్థలం బెంగళూరు. నవీన్ ఎంతో మంది ప్రముఖులకు డిజైనర్‌గా పనిచేశారు. అంతేకాకుండా అనేక టీవీ షోలు, అంతర్జాతీయ షోలకు ఫ్యాషన్ డిజైనర్ సుపరిచితుడే.
