AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టారా..? దేశ రాజకీయాల్లో ఆయన పేరు ఇప్పుడు సెన్సేషన్

ఆయన ట్రబుల్‌ షూటర్‌. కష్టాల్లో ఉన్న పార్టీని కంటికి రెప్పలా కాపాడిన నేత. డ్యాషింగ్‌ లీడర్‌షిప్‌తో అంతా తానై కేడర్‌ను కదం తొక్కించారు. ప్రతీ సమస్యను అధిగమించి.. హైకమాండ్‌కు తల్లో నాలుకగా మారారు. ఇక పార్టి పని అయిపోయిందనుకున్న చోట..కార్యకర్తలను ముందుకు నడిపించారు.

Viral Photo: ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టారా..? దేశ రాజకీయాల్లో ఆయన పేరు ఇప్పుడు సెన్సేషన్
Leader Childhood Photo
Ram Naramaneni
|

Updated on: May 17, 2023 | 2:33 PM

Share

సోషల్ మీడియా వేదికగా ప్రజంట్ సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు అంటే కేవలం సినిమా వారే కాదండోయ్. స్పోర్ట్స్ స్టార్స్,  బిజినెస్ టైకూన్స్, కొరియన్ బ్యాండ్ స్టార్స్, పొలిటిషియన్స్.. ఇలా అందరూ ఉన్నారు. తాజాగా మీ ముందుకు ఓ పొలిటిషియన్ యంగ్ ఏజ్ ఫోటోను తీసుకొచ్చాం. ఇతను పేరు ఇప్పుడు అటు ట్విట్టర్‌లో ఇటు ప్రజల్లో ట్రెండింగ్‌లో ఉంది. క్లూ ఏంటంటే.. ఈయన కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు. ట్రబుల్ షూటర్ అని పేరుంది. ఇప్పుడు చాలామందికి బల్బు వెలిగి ఉండవచ్చు. ఆయన ఎవరో కాదు.. కన్నడనాట జరిగిన తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి…, కర్నాటక కాంగ్రెస్ చీఫ్.. దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయానికి అవిశ్రాంతంగా శ్రమించారు KPCC అధ్యక్షుడు డీకే శివకుమార్‌. ఐటీ, ఈడీ కేసులకు తట్టుకుని కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. కనకపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శివకుమార్..గతంలో కుమారస్వామి మంత్రివర్గంలో నీటిపారుదలశాఖ మంత్రిగా, సిద్ధరామయ్య మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్..1962 మే 15న బెంగళూరు సమీపంలోని కనకపురలో జన్మించారు.1993లో ఉషను పెళ్లిచేసుకున్న శివకుమార్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

1980లో విద్యార్థి దశలోనే డీకే శివకుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి క్రమంగా ఎదిగిన ఆయన..కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989లో తొలిసారి 27 ఏళ్ల వయసులో మైసూరు జిల్లాలోని సతనూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తాజా గెలుపుతో 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయ దుంధుబి మోగించారు. 2008, 2013, 2018 ఎన్నికల్లో సతనూరు నుంచి కనకపురకు మారిన శివకుమర్ వరుస విజయాలు సాధించారు. తాజాగా ఈ ఎన్నికల్లోనూ కనకపుర నుంచి గెలుపొందారు. దీంతో సతనూర్ నుంచి నాలుగు సార్లు, కనకపుర నుంచి నాలుగుసార్లు గెలిచారాయన.

2017 ఆగస్ట్ 2న బెంగుళూరులోని డీకే శివకుమార్ నివాసం, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారులు దాడిచేశారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ ఈ తనిఖీలు నిర్వహించింది. శివకుమార్ రిసార్ట్ సహా మొత్తం 67 ప్రాంతాల్లో 300 మంది అధికారులు 80 గంటల పాటు సోదాలు చేశారు. 2017లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన రిసార్ట్‌లో ఉంచిన తర్వాత ఈ ఐటీ దాడులు జరగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో శివకుమార్ సహా అతని సన్నిహితులకు ముందస్తు బెయిల్ లభించింది. తర్వాత 2019 సెప్టెంబర్ 3న ఆదాయపు పన్ను ఎగవేత కేసు, మనీలాండరింగ్ కేసుల్లో శివకుమార్‌ అరెస్టయ్యారు. 104 రోజులపాటు తిహార్ జైల్లో ఉన్న ఆయన.. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు.

2020 జూలై 2న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. 2002లో అప్పటి మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే పరిస్థితి రాగా.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను తన రిసార్ట్‌లో ఉంచి ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. ఈ సంఘటనతో శివకుమార్ రాజకీయ భవిష్యత్ మారిపోయింది. 2017లో రాజ్యసభ ఎన్నికల వేళ 42 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకుండా ఉండేందుకు బెంగళూరులోని తన రిసార్ట్‌లోకి తరలించి హస్తం పార్టీ అధిష్ఠానానికి సహకరించారు. 2018లో ఎన్నికల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అందుకే డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో డీకే శివకుమార్‌కు మంచి సంబంధాలున్నాయి. దేశంలో ఉన్న అత్యంత ధనవంతులైన రాజకీయనాయకుల్లో శివకుమార్ ఒకరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం