Viral Video: నీటి కొలనులో ముసలితో తలపడిన చిరుత.. గెలుపు ఎవరిదో మీరు ఊహించలేరు..
బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. ఎందకంటే బలవంతుడికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ కొన్నిసార్లు బలహీనుడిది కూడా పై చేయి అవుతుంది...
బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. ఎందకంటే బలవంతుడికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ కొన్నిసార్లు బలహీనుడిది కూడా పై చేయి అవుతుంది. దీనికి ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది ఓ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral Video) అవుతోంది. ఈ వీడియో చూస్తే చాలా మందికి సుమతీ శతకం గుర్తోస్తుంది. బలవంతుడ నాకేమని.. పలువురితో నిగ్రహించి పలుకుట మేలా.. బలవంతమైన సర్పము.. చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ..! దీని అర్థం ఏమిటంటే.. నేను చాలా బలవంతుడిని. నాకేమీ భయంలేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి, విరోధం కొనితెచ్చుకోవడం మంచిది కాదు. అది అతడికి ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగినట్టి విష సర్పం కూడా చలిచీమల చేతికి చిక్కి చస్తుంది. ఇలాగే బలం ఎక్కువ ఉందని ఓ ముసలి చిరుతపై దాడి చేయడానికి ప్రయత్నించి కంగుతిన్నది.
సాధారణంగా నీటిలో ముసలికి ఎక్కువ బలం ఉంటుంది. అందుకే ఎంత పెద్ద జంతువు వచ్చినా పట్టేస్తుంది. నీటిలో తనకు ఎదురులేదని అనుకున్న ముసలి.. నీరు తాగడానికి వచ్చిన చిరుతను పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ నీటిలో ముసలి కన్నా బలహీనంగా ఉండే చిరుత ముసలినే పట్టి.. ముప్పుతిప్పల పెట్టింది. ఇలా ముసలి, చిరుత మధ్య పోరు కొన్ని నిమిషాలపాటు జరిగింది. చివరికి ఎవరో గెలిచారో ఈ వీడియోలో లేనప్పటికీ.. వీడియోను బట్టి చిరుతదే పైచేయిగా కనిపిస్తుంది. దీన్ని బట్టి బలం ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తే తిప్పలు తప్పవని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వైల్డ్‌యూనివర్స్ ఇస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
View this post on Instagram
Read Also.. Viral Video: కలెక్టరేట్‌లో ఒక్కసారిగా గందరగోళం.. ఏం జరిగిందని చూడగా షాకింగ్ సీన్!