AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాచ్‌ మధ్యలో శివుడు.. అనంత్ అంబానీ చేతికి ఆధ్యాత్మిక అద్భుతం.. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..

అనంత్ అంబానీ విలాసవంతమైన జీవనశైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ధరించే దుస్తుల దగ్గర నుండి వాడే కార్ల వరకు ప్రతిదీ ఒక సంచలనమే. అయితే తాజాగా అనంత్ అంబానీ చేతికి ఉన్న ఒక అరుదైన వాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం సమయాన్ని చూపించే వాచ్ మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలబోసిన ఒక అద్భుతం.

వాచ్‌ మధ్యలో శివుడు.. అనంత్ అంబానీ చేతికి ఆధ్యాత్మిక అద్భుతం.. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..
Anant Ambani Rs 12 Crore Shiva Watch
Krishna S
|

Updated on: Apr 24, 2026 | 6:34 PM

Share

భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం అనగానే అపర కుబేరత్వం, విలాసవంతమైన జీవనశైలి కళ్లముందు కదలాడుతాయి. ముఖ్యంగా అంబానీ వారసుడు అనంత్ అంబానీకి ఉన్న అరుదైన గడియారాల సేకరణ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆయన ధరించిన ఒపెరా గాడ్‌ఫాదర్ బాగెట్ శివ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆధ్యాత్మికతను, అత్యున్నత సాంకేతికతను మేళవించిన ఈ వాచ్ విశేషాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

అధ్యాత్మికతకు అద్దం పట్టే డిజైన్

ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ జాకబ్ & కో అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కస్టమ్ వాచ్ ఒక అద్భుతమైన కళాఖండం. ఈ వాచ్ డయల్ మధ్యలో ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుని చిన్న విగ్రహాన్ని ఎంతో సూక్ష్మంగా చెక్కారు. దీని పక్కనే పవిత్రమైన ఓం చిహ్నం కూడా ఉంటుంది. దీని కేసింగ్‌ను 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారు చేశారు. వాచ్ అందాన్ని రెట్టింపు చేస్తూ ఇందులో 300కు పైగా బాగెట్ కట్ వజ్రాలతో సహా మొత్తం 1000 కంటే ఎక్కువ వజ్రాలను ఉపయోగించారు.

సాంకేతిక అద్భుతం

ఈ వాచ్ కేవలం చూడటానికి మాత్రమే అందంగా ఉండదు దీని లోపల అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ దాగి ఉంది. ఇందులో మొత్తం 658 చిన్న భాగాలు ఉన్నాయి. సమయ ఖచ్చితత్వం కోసం ఇందులో ట్రిపుల్-యాక్సిస్ టోర్బిలాన్ అనే అత్యాధునిక సాంకేతికతను వాడారు. ఇది ఒక మ్యూజికల్ వాచ్. ఇందులోని 120-నోట్ మ్యూజిక్ బాక్స్ సిస్టమ్ ద్వారా ప్రసిద్ధ ది గాడ్ ఫాదర్ మూవీ ట్యూన్‌ను వినవచ్చు. సంగీతం వస్తున్నప్పుడు వాచ్ లోపలి భాగాలు కదిలే తీరు అద్భుతంగా ఉంటుంది.

ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

ఈ ఒక్క వాచ్ అంచనా విలువ సుమారు రూ.12 కోట్లు. అయితే అనంత్ అంబానీ వద్ద ఉన్న మొత్తం వాచీల సేకరణ విలువ రూ. 200 కోట్లకు పైగానే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆయన వద్ద పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే వంటి ప్రపంచ అరుదైన బ్రాండ్‌లు ఎన్నో ఉన్నాయి. గతంలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సైతం అనంత్ వాచీల కలెక్షన్ చూసి ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. సంపదకు ఆధ్యాత్మికత తోడైతే ఎలా ఉంటుందో అనంత్ అంబానీ వాచ్ నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ వాచ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Follow Us