మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని ఆయన కోడలు ప్రీతిరెడ్డి తోసిపుచ్చారు. తాము బీఆర్ఎస్లో ఉన్నామని.. BRSలోనే కొనసాగుతామని స్పష్టంచేశారు. పార్టీ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో, విద్యకే తమ మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలియజేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.