AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disco Shanthi: సారీ చరణ్.. మగధీర చేయొద్దని శ్రీహరికి చెప్పా..

Disco Shanthi: సారీ చరణ్.. మగధీర చేయొద్దని శ్రీహరికి చెప్పా..

Phani CH
|

Updated on: Apr 24, 2026 | 4:26 PM

Share

రాజమౌళి మగధీరలో శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్ర అద్భుతం. అయితే, ఈ పాత్ర చేయవద్దని డిస్కో శాంతి తన భర్త శ్రీహరికి మొదట చెప్పారట. హీరో స్థాయి వ్యక్తి సపోర్టింగ్ పాత్ర చేయకూడదన్నది ఆమె అభిప్రాయం. కానీ, ఆ పాత్ర ప్రాముఖ్యత, రాజమౌళి దార్శనికత తర్వాత ఆమెకు అర్థమయ్యాయి. ఈ ఆసక్తికర విషయాన్ని డిస్కో శాంతి ఇటీవల పంచుకున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మగధీర. 2009లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దేవ్ గిల్ విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో రియల్ స్టార్ శ్రీహరి నటించారు. షేర్ ఖాన్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత బాగా హైలెట్ అయ్యింది శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్రనే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాత్రను మొదట చేయొద్దని.. శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి.. తన భర్తకు చెప్పారట. మగధీర సినిమాకు సంబంధించి శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఇటీవల ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మగధీర చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్‌ చేయొద్దని బావ శ్రీహరికి తాను చెప్పానని చెప్పుకొచ్చారు.ఒక హీరో భార్యగా.. హీరో వేరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు కదా అనే ఆలోచన తనలో ఉండేదని.. రాజమౌళి సినిమాలో హీరోగా అయితేనే చేయమని.. సపోర్టింగ్‌ రోల్ అయితే వద్దని.. తాను తన భర్త శ్రీహరికి సూచించినట్టు డిస్కో శాంతి చెప్పుకొచ్చారు. మొదట శ్రీహరి.. తనకు మగధీర కథ చెప్పలేదని.. కానీ రామ్ చరణ్ సినిమాలో ఈ క్యారెక్టర్‌ లేకపోతే సినిమానే లేదనే విషయం తనకు తర్వాత అర్థమైందంటూ డిస్కో శాంతి చెప్పుకొచ్చారు. రాజమౌళి ఈ క్యారెక్టర్‌ను ఎంత మనసు పెట్టి చేయించారో మెల్లగా అర్థమైందంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు డిస్కో శాంతి. డిస్కో శాంతి విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు శాంత కుమారి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మార్చుకుంది. డిస్కో శాంతి దాదాపు 900కి పైగా చిత్రాల్లో కనిపించింది. స్పెషల్ సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, తమిళం, మలయాళం, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసిందామె. ఇదే క్రమంలో నటుడు శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1996 వీరి వివాహం జరగ్గా అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది.ఎక్కువగా తన కుటుంబాన్ని చూసుకోవడానికే పరిమితమైంది. అయితే ఊహించని విధంగా శ్రీహరి 2013 అక్టోబరు 9 కాలేయ సంబంధ వ్యాధితో కన్నుమూశారు. ఇప్పుడు తన పిల్లలే లోకంగా జీవిస్తోంది డిస్కో శాంతి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..

మందు బాబులకు అలర్ట్! వేసవిలో.. డ్రింక్ చేస్తే గుండె లయ తప్పుతుందా ??

మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..

రసగుల్లా తింటే పక్షవాతం ఖాయమా? డాక్టర్లు ఏం చెప్పారు?

Follow Us