Viral Video: పడగ విప్పిన నాగుపాములు.. ఆట చూస్తే అదరిపోవాల్సిందే..!

Viral Video: సోషల్‌ మీడియాలో జంతువుల వీడియోలకు ఫాలోయింగ్‌ ఎక్కువ. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. అందుకే ఈ వీడియోలు తొందరగా వైరల్‌ అవుతుంటాయి.

Viral Video: పడగ విప్పిన నాగుపాములు.. ఆట చూస్తే అదరిపోవాల్సిందే..!
Cobras
Follow us
uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 9:43 PM

Viral Video: సోషల్‌ మీడియాలో జంతువుల వీడియోలకు ఫాలోయింగ్‌ ఎక్కువ. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. అందుకే ఈ వీడియోలు తొందరగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా బిహార్ పాట్నాలోని ఓ పార్కులో రెండు నాగుపాముల ఆటకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది. ఇప్పుడు ఈ పాముల వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. అయితే పాములలో ప్రత్యేకమైనది నాగుపాము. కొంతమంది దీనిని దైవ సమానంగా భావిస్తారు. నాగుపాము పడగ విప్పిందంటే ఎవ్వరైనా భయపడాల్సిందే. కాటు వేసిందంటే నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలుస్తాయి.

ఈ వైరల్ వీడియోలో రెండు కోబ్రా పాములు ఒకదానితో ఒకటి సరదాగా ఆడుకోవడం మనం గమనించవచ్చు. బీహార్ ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్ సింగ్ ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. జంతుప్రదర్శనశాలలో చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న ఈ రెండు పాములు ఆటలాడుతూ ఫైటింగ్‌కి సిద్దపడుతున్నాయి. ఒకదాని కొకటి పడగ విప్పి నిటారుగా నిలుచొని నువ్వా.. నేనా సై అన్నట్లు చూస్తున్నాయి. వాటి తలలను అటు ఇటు తిప్పుతూ యుద్దానికి సిద్దమన్నట్లు సైగ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తుంది.

ఈ వీడియో రెండు రోజుల క్రితంషేర్ చేశారు. అప్పటి నుంచి ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి 4 వేల 7 వందల కంటే ఎక్కువ వీక్షణలు, 203 లైక్‌లు వచ్చాయి. పాముల బంధాన్ని చూసి పరవశించిన 31 మంది దీన్ని షేర్ చేశారు. ట్విట్టర్ వినియోగదారుల్లో ఒకరు ఇలా కామెంట్ చేశారు. పాముల ఫైటింగ్‌ భలే ఉందంటు రాశారు. మరికొందరు జంతు ప్రేమికులు మూగ జంతువులను కాపాడటం మన బాధ్యత అంటు కామెంట్ చేశారు. మీరు కూడా వీడియో చూసి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌..! ఇప్పుడు కారులో కూర్చొని సినిమా చూడొచ్చు.. ఎక్కడంటే..?

Ducati: డుకాటి కంపెనీ బైక్‌ ఖరీదు రూ.10 లక్షలు.. ఫీచర్లు, స్పీడ్‌ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

TRS Telangana Vijaya Garjana: టీఆర్ఎస్ తెలంగాణ విజయ గర్జన సభ వాయిదా.. మరో తేదీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్..