Old Coin: నాణేలు పురాతనమైనా కొద్ది వాటికి డిమాండ్ కూడా పెరుగుతుంటుంది. అయితే, ఈ డిమాండ్ దుకాణాదారుల నుంచి కాదండోయ్.. పాత నాణేలు, పురాతన వస్తువుల సేకరించే వారి నుంచి. పురాతన వస్తువుల సేకరించే అభిరుచి ఉన్న వారు.. ఎంత డబ్బు చెల్లించి అయినా వాటిని సేకరిస్తుంటారు. అలా పురాతన నాణేలు, వస్తువులకు తెగ డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పాత 50 పైసల నాణేనికి విపరీతమైన డిమాండ్ ఉంది. 50 పైసల పురాతన నాణెనికి రూ. లక్ష చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మీ చేతిలో ఈ పురాతన 50 పైసల నాణెం ఉంటే.. దానిని ఎలా విక్రయించాలి? అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వర్చువల్ యుగంలో చాలా మంది ఔత్సాహికులు పురాతన నాణేలు సేకరించేందుకు అమితాసక్తి కనబరుస్తారు. వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. పురాతన నాణెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద బిడ్డింగ్‌లే జరుగుతాయి. అలా పురాతన నాణేలకు భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి. వాస్తవానికి 2011 నుంచి 50 పైసల నాణేలు చెలామణిలో లేకుండా పోయాయి. అంతకు ముందు నుంచే 25 పైసల నాణెం కూడా చెల్లకుండా అయ్యింది. నాడు చెల్లకుండా పోయిన ఈ నాణేలు.. ఇప్పుడు కనక వర్షం కురిపిస్తున్నాయి. కరెన్సీ విలువ తగ్గినప్పటికీ.. ఆ నాణెం విలువ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం చలామణిలోని ఈ నాణెల కోసం ఔత్సాహికులు.. చాలా ఆసక్తిగా వెతుకుతున్నారు. వీటిని సేకరించేందుకు ఎంత డబ్బు చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు.
పాత నాణేలను ఎలా అమ్మాలి..
పాత నాణేలను అమ్మడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై కొంచెం అవగాహన ఉన్నా.. మీరు ఈ పనిని చిటికెలో చేసేయొచ్చు. అది కూడా ఇంట్లో కూర్చుని.. మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి మీ వద్దనున్న పురాతన నాణేన్ని విక్రయించవచ్చు. ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వెళదాం. మీరు ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్‌ఫామ్ OLX కి వెళ్లండి. మీ వద్ద పురాతన నాణేలు ఉన్నట్లయితే, వాటిని విక్రయించాలనుకుంటే.. OLX లో అకౌంట్ క్రియేట్ చేయండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ద్వారా అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అకౌంట్ క్రియేట్ చేసిన తరువాత. మీ వద్దనున్న పురాతన నాణేన్ని ఫోటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. మీ కాంటాక్ట్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరికైనా మీరు అప్‌లోడ్ చేసిన నాణెం నచ్చినట్లయితే.. వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలా మీ నాణేన్ని విక్రయించవచ్చు.
Also read:
Home Remedies for Stone Problems: కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్యలా? వీటి ద్వారా ఉపశమనం పొందండి..!
Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!