Fry Papad Without Oil: నూనెలో వేయకుండానే అప్పడాలు వేయించవచ్చు.. ఎలాగంటే..
అప్పడాలు, చిప్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఎండాకాలం రాగానే మహిళలు అందరూ వడియాలు, అప్పడాలు తయారు చేస్తూ ఉంటారు. ఇంకా వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ అప్పడాలు, వడియాలు సంవత్సర కాలం అంతా నిల్వ ఉంచుతారు. పప్పు, రసం, పప్పు చారు వంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వీటిని వేయించుకుని తింటూ ఉంటారు. అంతే కాకుండా సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ ఇంట్లో లేనప్పుడు వీటినే ఫ్రై చేసుకుని తింటారు. పిల్లలు, పెద్దలు వీటిని ఎంతో..
అప్పడాలు, చిప్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఎండాకాలం రాగానే మహిళలు అందరూ వడియాలు, అప్పడాలు తయారు చేస్తూ ఉంటారు. ఇంకా వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ అప్పడాలు, వడియాలు సంవత్సర కాలం అంతా నిల్వ ఉంచుతారు. పప్పు, రసం, పప్పు చారు వంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వీటిని వేయించుకుని తింటూ ఉంటారు. అంతే కాకుండా సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ ఇంట్లో లేనప్పుడు వీటినే ఫ్రై చేసుకుని తింటారు. పిల్లలు, పెద్దలు వీటిని ఎంతో ఇష్ట పడతారు. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కడ భోజనాలకు వెళ్లినా ఈ చిప్స్ అనేవి ఖచ్చితంగా వేస్తారు.
ఈ చిప్ప్, అప్పడాలు, వడియాలు వంటివి ఆయిల్‌లో ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. కానీ ఆయిల్‌లో వేయించినవి తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇతర సమస్యలు వంటివి రావచ్చు. కానీ ఆయిల్ లేకుండా వీటిని మనం వేయించుకుని తినవచ్చు. అదెలా? అని షాక్ అవుతున్నారా? ఇది నిజమే ఆయిల్ లేకుండానే వడియాలు, చిప్స్, అప్పడాలు వేయించుకోవచ్చు. చెఫ్ పంకజ్ మనకు ఆ టిప్స్ ఏంటో చెప్పారు.
ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో ఆమె చిప్ప, అప్పడాలు వేయించుకోవడానికి.. ఓ మూకిడి తీసుకుంది. అందులో ఆయిల్‌కి బులు సాల్ట్ వేసింది. ఆ ఉప్పును మీడియం మంటలో పెట్టింది. అప్పడం, చిప్స్ ఇలా ఒక్కొక్కటి వేస్తూ వేయించింది. అవి కూడా బాగా వేగాయి. ఇకపై అప్పడాలు, వడియాలు వేయించడానికి నూనె అవసరం లేదు. సాల్ట్ బదులు మనం శుభ్రం చేసిన ఇసుక కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మంచి న్యూస్ షేర్ చేశారు థాంక్స్ అని చెబుతున్నారు.
వీడియో చూసేయండి.
View this post on Instagram