పగలు, రాత్రిని బ్యాలెన్స్ చేస్తున్న భూమిని చూశారా..!

భూవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే సంవత్సరంలో విషువత్తుల సమయంలో సగం పగలు, సగం రాత్రిని భూమి సంతులనం(బ్యాలెన్స్) చేస్తుంది. అలా పగలు, రాత్రిని భూమి సంతులనం చేసే ఓ ఫొటోను జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం ఇటీవల విడుదల చేసింది. జియోస్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్‌మెంటల్ శాటిలైట్ సహాయంతో జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం మార్చి 20న ఈ ఫొటోను తీసింది. అందులో అమెరికన్ సిటీలలో రాత్రి ఉండగా.. అట్లాంటిక్ […]

పగలు, రాత్రిని బ్యాలెన్స్ చేస్తున్న భూమిని చూశారా..!
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 2:35 PM

భూవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే సంవత్సరంలో విషువత్తుల సమయంలో సగం పగలు, సగం రాత్రిని భూమి సంతులనం(బ్యాలెన్స్) చేస్తుంది. అలా పగలు, రాత్రిని భూమి సంతులనం చేసే ఓ ఫొటోను జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం ఇటీవల విడుదల చేసింది. జియోస్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్‌మెంటల్ శాటిలైట్ సహాయంతో జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం మార్చి 20న ఈ ఫొటోను తీసింది. అందులో అమెరికన్ సిటీలలో రాత్రి ఉండగా.. అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికా పగలు ఉంది.

అయితే సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే ఈ విషువత్తులు సంభవిస్తాయి. మార్చి(20), సెప్టెంబర్‌(23)లలో విషువత్తులు రాగా.. మార్చిలో వచ్చే విషువత్తుకు ‘వసంత విషువత్తు’ అనే పేరుంది. ఈ సమయంలో భూమధ్యరేఖా తలం సూర్యుడి గుండా పోతుంది. దానివలన అన్ని అక్షాంశాల్లో రాత్రి, పగలు దాదాపు సమానంగా ఉంటాయి. కాగా ‘వసంత విషువత్తు’ తరువాతి వచ్చే రోజుల్లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.