AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

Himalayan Maggi Millionaire: హిమాలయాల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ. 21,000 సంపాదించిన యువకుడు బాదల్ ఠాకూర్ కు సంబంధించిన విజయగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్యాటకుల డిమాండ్‌ను గుర్తించి, చల్లని వాతావరణంలో వేడి మ్యాగీ అమ్మాలనే అతని ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో, ఇది మార్కెట్ డిమాండ్, సరైన బిజినెస్ ప్లానింగ్‌కు నిదర్శనంగా మారింది.

Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
Himalayan Maggi
Anand T
|

Updated on: Jan 27, 2026 | 10:12 PM

Share

ఏ ప్లేస్ ఎలాంటి వస్తువులకు డిమాండ్ ఉంటుందో తెలుసుకొని.. అక్కడ వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తే మన బిజినెస్‌కు తిరుగులేనట్టే. అలాంటి ఆలోచనే చేశాడు ఓ యువకుడు. హిమాలయాల్లో మ్యాగీ అమ్మడం స్టార్ట్ చేసి తక్కువ సమయంలో బాగా డబ్బులు సంపాధించాడు. కేవతం అతను మ్యాగీ అమ్మడం ద్వారానే ఒక రోజులో రూ.21వేలు సంపాధించినట్టు వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హిమాలయ పర్వతాలలో మ్యాగీ నూడుల్స్ అమ్మడం ద్వారా ఒకే రోజులో దాదాపు రూ.21,000 సంపాదించానని ఓ కుర్రాడు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. బాదల్ ఠాకూర్ అనే యువకుడు పర్వత ప్రాంతాల్లో మ్యాగి అమ్మడం ఎలా అనే ప్రయోగాన్ని స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా ఒక ప్రాంతంలో ఒక టేబుల్‌ వేసుకొని చిన్న సిలిండర్, స్టవ్ ఏర్పాటు చేసుకొని మ్యాగీ స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మ్యాగీ ప్రిపేర్ చేసి ఒక సాదా మ్యాగీ అయితే ప్లేట్‌ రూ.70కి, ఛీజ్‌ మ్యాగీ అయితే ప్లేట్‌ రూ.100కు అమ్మడం స్టార్ట్ చేశాడు.

ఇలా ఒక్క రోజులో సుమారు 300-350 ప్లేట్‌ల వరకు మ్యాగీ అమ్మడం ద్వారా కేవలం ఒక్క రోజులోనే రూ.21,000 సంపాదించవచ్చనే అంచనా వేశాడు. అతను అనుకున్నట్టుగానే అక్కడ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు చల్లటి వాతావరణంలో వేడి వేడి మ్యాగీ కోసం ఎగబడ్డారు. దీంతో ఠాకూర్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో తన ప్రయోగానికి సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 4 మిలియన్ల వీవ్స్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..
ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఇది ఫ్లవర్‌ కాదండోయ్..పవర్‌ ఫుల్ మెడిసిన్‌!ఎన్ని లాభాలో తెలిస్తే!
ఇది ఫ్లవర్‌ కాదండోయ్..పవర్‌ ఫుల్ మెడిసిన్‌!ఎన్ని లాభాలో తెలిస్తే!