Viral Video: హృదయానికి హత్తుకునే అందమైన దృశ్యం.. నడిరోడ్డుపై జింక ఏం చేస్తుందో చూడండి..

Mother Love: మనిషి అయినా, జంతువు అయినా తల్లి ప్రేమలో వ్యత్యాసమే లేదు. తన పిల్లల కోసం ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొంటుంది. తన పిల్లల రక్షణ కోసం తన ప్రాణాలను

Viral Video: హృదయానికి హత్తుకునే అందమైన దృశ్యం.. నడిరోడ్డుపై జింక ఏం చేస్తుందో చూడండి..
Baby Deer
Follow us

|

Updated on: Jan 07, 2023 | 7:05 PM

మనిషి అయినా, జంతువు అయినా తల్లి ప్రేమలో వ్యత్యాసమే లేదు. తన పిల్లల కోసం ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొంటుంది. తన పిల్లల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడుతుంది. పొరపాటున ప్రమాదంలో ఇరుక్కున్నట్లయితే.. ఏమాత్రం సందేహించకుండా తన బిడ్డకు సహాయం చేసేందుకు ముందుకొస్తుంది తల్లి. అందుకు ఈ లోకంలో తల్లిని మించిన యోధులు మరొకరు లేరని అంటారు. అందుకే నిదర్శనమైన వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ బలాదూర్ అంటూ ఎమోషనల్ అయిపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అడవి మధ్యలోంచి రోడ్డు మార్గం ఉంది. అయితే, ఓ జింక, దాని పిల్ల రోడ్డును దాటేందుకు ప్రయత్నించాయి. కానీ, పిల్ల జింక రోడ్డు దాటలేక మధ్యలో కూలబడిపోయింది. వీడియో చూస్తే కొద్దిగంటల క్రితమే అది పుట్టినట్లుగా తెలుస్తోంది. అయితే, రోడ్డు మధ్యలో ఆగిపోయిన పిల్ల జింక వద్దకు ఆ తల్లి జింక వచ్చి.. దానిని రోడ్డు దాటించే ప్రయత్నం చేసింది. ‘అరేయ్ పైకి లేచి, రోడ్డు దాటురా’ అని చెబుతున్నట్లుగా దాని టచ్ చేస్తూ.. ముందుకు కదిలించింది. చివరకు ఆ పిల్ల జింక మెల్లగా తన తల్లితో కలిసి రోడ్డు దాటేసింది.

ఇవి కూడా చదవండి

అయితే, తల్లి జింక, పిల్ల జింక రోడ్డు దాటేంత వరకు వాహనదారులు తమ వాహనాలను దూరంగా నిలిపివేశారు. తమ ఫోన్ కెమెరాలతో వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ క్యూట్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తల్లీ బిడ్డల మధ్య ప్రేమ, బిడ్డ కోసం తల్లి పడిన తపన చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..