AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500 నోటు స్పెషల్ గురూ.. ఆసక్తికరమైన విషయాలు మీకోసమే

ప్రతిరోజు చాలామంది లావదేవీల కోసం 500 రూపాయల నోటును వాడుతుంటారు. 2016లో డిమానిటైజేషన్ వల్ల కొత్త నోట్లు అందుబాటులోకి రావడం అందరికీ తెలసిందే. అయితే ఈ రూ.500 నోటులో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఆ నోటులో ఉన్న ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.500 నోటు స్పెషల్ గురూ.. ఆసక్తికరమైన విషయాలు మీకోసమే
Currency
Aravind B
|

Updated on: Mar 26, 2023 | 8:23 AM

Share

ప్రతిరోజు చాలామంది లావాదేవీల కోసం 500 రూపాయల నోటును వాడుతుంటారు. 2016లో డిమానిటైజేషన్ వల్ల కొత్త నోట్లు అందుబాటులోకి రావడం అందరికీ తెలసిందే. అయితే ఈ రూ.500 నోటులో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఆ నోటులో ఉన్న ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిలువ గీత ఎందుకంటే: ఈ కరెన్సీ నోటులో ఉన్నటువంటి నిలువు గీత సెక్యూరిటీ థ్రెడ్ కు సంబంధించింది. ఇది ఆ కరెన్సీకి సంబంధించి ముఖ్యమైన భద్రతా ఫీచర్ లలో ఆ నిలువు గీత కీలకమైంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ గీత.. నోటును వంచి చూసినప్పుడు ముదురు నీలి రంగులోకి మారిపోతుంది. ఒకవేళ రంగు మారలేదంటే అది అసలైన కరెన్సీ కాకాపోవచ్చు.

2.వాటర్‌ మార్క్‌ చూశారా: కరెన్సీ నోటు కుడి, ఎడమన ఒకవైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. కాస్త వెలుతురులో ఆ నోటును చూసినప్పుడు మహాత్మా గాంధీ చిత్రం, అంకెలలో నోటు విలువ సంఖ్య వాటర్‌మార్క్‌ కనిపిస్తుంది. వాటర్‌ మార్క్‌తో పాటు నోట్‌ విలువ సంఖ్య తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

3. అందుకే చిన్న అక్షరాలు: కరెన్సీ నోటుపై చిన్న సైజ్ లో కూడా ఇంగ్లీషు, హిందీ భాషలో అక్షరాలు రాసి ఉంటాయి. అక్షరాస్యత, కంటిచూపు కలిగినవారు ఎవరైనా ఈ అక్షరాలను స్పష్టంగా చదవగలిగేలా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు

4.ముద్రణలో తేడాలుంటాయా: కరెన్సీ నోటు ముద్రణలో చాలా గీతలతో కూడిన డిజైన్స్‌, కొన్ని ఇమేజెస్‌ ఉంటాయి. వీటి నాణ్యత స్పష్టంగా ఉంటాయి. రంగులు ప్రకాశవంతంగాను ఉంటాయి. ఒకవేల నోటు కొద్ది సేపు తడిసినా, చెమటకు గురయినా.. రంగులు, ముద్రణ నాణ్యతలో ఎటువంటి తేడాలుండవు.

5. నోటు కాగితం ఎక్కడిదంటే: కరెన్సీ నోటును ముద్రించే కాగితం సాధారణ పేపర్‌ లాంటిది కాదు. ఇది 75% పత్తి, 25% నార మిశ్రమంతో కూడిన కాటన్‌ పేపర్‌తో తయారుచేస్తారు. ఈ కారణం చేత నోటు కొద్ది సేపు తడిచినా కూడా మామూలు పేపర్‌లా చిరగదు.

6.ఇంటాగ్లియో ప్రింటింగ్‌: కరెన్సీ నోటుపై మహాత్మ గాంధీ చిత్రం ఉండే నోటు వైపు ఎడమ, కుడి చివర్లలో క్రాస్‌గా ఐదు చిన్న గీతలు ఉంటాయి. వీటిని వేళ్లతో తడిమినప్పుడు ఉబ్బెత్తుగా అనిపిస్తాయి. ఇది నోటుపై ఉబ్బెత్తు ప్రభావాన్ని కలుగజేసే సాంకేతిక ప్రింటింగ్‌ ప్రక్రియ. ఈ గీతలను వేళ్లతో తడిమినప్పుడు స్పర్శ తెలుస్తుంది.

ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నింటిని పరిశీలిస్తే రూ.500 నోటు అసలైనదా, కాదా అనేది వెంటనే తెలుసుకోవచ్చు.

హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!