Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్!
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు కోకొల్లలు. ప్రతీ రోజూ ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. మ్యారేజ్‌లకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు..
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు కోకొల్లలు. ప్రతీ రోజూ ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. మ్యారేజ్‌లకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు.. ఈ కంటెంట్‌కు నెటిజన్లు బాగా ఆకర్షితులవుతారు. అందులో కొన్ని మనల్ని కడుపుబ్బా నవ్వేలా చేస్తాయి. ఇక తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..
అసలు విషయానికొస్తే.. పెళ్లిలో పూల మాలలతో ఫన్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఓ వ్యక్తికి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు పెళ్లికొడుకు. పెళ్లి తర్వాత నిర్వహించిన రిసెప్షన్‌లో.. నవ వధూవరులు ఇద్దరూ స్టేజ్‌పై నిల్చోని ఉన్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి డ్రోన్‌కు రెండు పూల మాలలు కట్టి, గాల్లోకి ఎగరవేశాడు. వధూవరులకు అందకుండా కాస్త ఎత్తులో వాటిని వేలాడదీసి, వాటిని అందుకోమని ఫన్నీ టాస్క్‌ను ఇచ్చాడు. ఇక రెండు మూడుసార్లు గాల్లోకి ఎగిరిన పెళ్లి కొడుక్కి ఆ పూల మాలలు అందలేదు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తిపోయిన వరుడు.. కోపంతో మూడోసారి పైకి ఎగిరి ఆ పూల దండలతో పాటు డ్రోన్ కెమెరాను పట్టుకుని నేలకు కొట్టాడు. దీంతో దెబ్బకు ఆ డ్రోన్ రెండు ముక్కలు అయింది. అంతే.! ఈ చర్యతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.