బట్టతల దాచిపెట్టి యువతితో పెళ్లి.. బండారం బయటపడగానే బ్లాక్‌ మెయిల్‌..! కట్‌చేస్తే..

గతంలో మన పెద్దలు తరచూ ఒక సామెత చెప్పేవారు..వంద అబద్ధాలు చెప్పి అయినా సరే ఒక పెళ్లి జరిపించాలని అంటుండేవారు. వంద అబద్ధాలు కాదు గానీ, ఒక్కోసారి ఒక్క అబద్ధం కూడా వివాహాన్ని విచ్ఛినం చేసేస్తుంది. అలాంటి ఒక షాకింగ్‌ ఘటన ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. ఒక యువకుడు తన బట్టతలని దాచిపెట్టి ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. చివరకు భార్యకు నిజం తెలిసిపోవటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య ఫిర్యాదు మేరకు బట్టతల భర్త సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బట్టతల దాచిపెట్టి యువతితో పెళ్లి.. బండారం బయటపడగానే బ్లాక్‌ మెయిల్‌..! కట్‌చేస్తే..
Man Hides Baldness

Updated on: Jan 06, 2026 | 1:14 PM

ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు తన బట్టతలని దాచిపెట్టి ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. నిజం తెలిసిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది. పోలీసుల ప్రకారం.. బాధితురాలు న్యూఢిల్లీలోని ప్రతాప్ బాగ్‌కు చెందిన ఒక యువకుడిని వివాహం చేసుకుంది. అయితే, అతడు తనకు జుట్టు రాలే సమస్య ఉందని చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో అతడు తన బట్టతల విషయం దాచిపెట్టి, సాధారణంగా కనిపించడానికి విగ్ ధరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా చెప్పారు. వివాహం తర్వాత ఆమె అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు, తన భర్త విగ్‌ను తీసి పక్కన పెట్టడం చూసింది. దాంతో అతని బండారం బయటపడింది. అది తట్టుకోలేని బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

అంతేకాడు..పెళ్లి కొడుకు మోసాన్ని గ్రహించిన బాధితురాలు భర్త, అత్తమామలను నిలదీయటంతో వారి ప్రవర్తన మారిపోయిందని చెబుతోంది. తన భర్త తన మొబైల్ ఫోన్‌తో ప్రైవేట్ ఫోటోలను తీశాడని, వాటిని వైరల్ చేస్తానని బెదిరించినట్టుగా ఆరోపించింది. డబ్బు కూడా డిమాండ్ చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ప్రతిఘటించడంతో తనను కొట్టి, మానసికంగా హింసించాడని కూడా ఆమె ఆరోపించింది. తన భర్తతో పాటు తన అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.

కొన్ని రోజుల క్రితం నిందితుడు ఆమె నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన నగలను లాక్కొని, ఆమెపై దాడి చేసి, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని ఆరోపించారు. దీని తరువాత, బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తతో సహా ఐదుగురిపై వరకట్న వేధింపులు, దాడి, బెదిరింపులు, మోసం, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని ఆరోపణలను తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నామని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..